నిజమైన విశ్వాసం

ఒకసారి విశ్వాసం అంటే ఏమిటని శిష్యులు అడగ్గా ‘ఆవగింజంత విశ్వాసం మీలో ఉండి.. పెద్దచెట్టును వేళ్లతో సహా పెకిలించి సముద్రంలో నాటాలనుకుంటే.. అది మీ ఆజ్ఞకు లోబడుతుంది’ (లూ.కా.17:6) అంటూ చెప్పాడు ఏసుప్రభువు.

Published : 20 Jul 2023 01:12 IST

ఒకసారి విశ్వాసం అంటే ఏమిటని శిష్యులు అడగ్గా ‘ఆవగింజంత విశ్వాసం మీలో ఉండి.. పెద్దచెట్టును వేళ్లతో సహా పెకిలించి సముద్రంలో నాటాలనుకుంటే.. అది మీ ఆజ్ఞకు లోబడుతుంది’ (లూ.కా.17:6) అంటూ చెప్పాడు ఏసుప్రభువు. ఇందుకు నిదర్శనమైన యదార్థ సంఘటన గుర్తుచేసుకుందాం..

ఇంగ్లండు వీధుల్లో ఎందరో అనాథ పిల్లలు యాచిస్తూ, నేరాలు చేస్తూ జీవించేవారు. అలాంటి పిల్లలకు జార్జి ముల్లర్‌ అనే భక్తుడు తన అనాథాశ్రమంలో ఆశ్రయమిచ్చేవాడు. ఓరోజు ఆశ్రమంలో రొట్టెలకు పిండి నిండుకోవడంతో పిల్లలకు ఉదయం అల్పాహారం అందలేదు. ఆశ్రమ నిర్వాహకులు ఆ సంగతి ముల్లర్‌కు చెప్పారు. అందుకాయన ఏమాత్రం కంగారు పడలేదు. పిల్లలందరినీ భోజనశాలకు రమ్మన్నారు. తాను మోకాళ్లపై కూర్చుని ప్రశాంత వదనంతో ప్రార్థిస్తూ, పిల్లల్నీ అలాగే చేయమన్నారు. ప్రార్థన ముగియబోతుండగా ఆశ్రమం ఎదుట పెద్ద వాహనం వచ్చి ఆగింది. దాన్నిండా కేకులు, బన్నులు, బిస్కెట్లు, జామ్‌ డబ్బాలు ఉన్నాయి. అలా ఆరోజు పిల్లలందరికీ ఆహారం అందింది. నిజమైన విశ్వాసం అంటే అదేనని రుజువైంది.

అసలు విషయానికి వస్తే- ఓ భాగ్యవంతుడి ఇంట్లో ఆరోజు జరగాల్సిన పెళ్లి అనుకోకుండా వాయిదాపడింది. విందు కోసం తెచ్చిన పదార్థాలు వృథా అవ్వకూడదని, ముల్లర్‌ ఆశ్రమంలో పిల్లలకు ఉపయోగపడతాయని పంపాడు. క్రీస్తు చెప్పిన విశ్వాసంతో జార్జిముల్లర్‌ ఆహారాన్ని సాధించాడు.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని