వెతుకులాట ఎందుకు?

పరమానందయ్య కథలు మనందరికీ సుపరిచితమే. వాటిలో ఓ కథ... పదిమంది శిష్యులు ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరారు.

Published : 20 Jul 2023 01:11 IST

పరమానందయ్య కథలు మనందరికీ సుపరిచితమే. వాటిలో ఓ కథ... పదిమంది శిష్యులు ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరారు. తీరా తమను లెక్క పెట్టుకుంటే ఒకరు తగ్గుతున్నారు. ఎవరు లెక్కపెట్టినా తనను వదిలేసి ఇతరులను లెక్కించడం వల్ల సంఖ్య తక్కువొస్తోంది. అది గ్రహించక తమలో ఒకరు ఏటిలో కొట్టుకుని పోయాడని బాధపడుతూ గురువు దగ్గరికొచ్చారు. ఆయన అందరినీ వరుసలో నిలబెట్టి లెక్కించి లెక్క చేతకాని మూర్ఖులంటూ తిట్టి విషయం చెప్పారు.

మనం వెతుకుతున్నది మనలోనే ఉందని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. మన పెద్దలు ఆసక్తికరమైన కథల మాటున అర్థవంతమైన అంశాలను బోధించారు. శాంతి, సంతృప్తి, ఆనందం.. మనలోనే ఉన్నాయని గ్రహించక బయట ఎక్కడో వెతుకుతుంటాం. ఉన్నదాన్ని దక్కించుకోవడం తెలియక ఏదో లోపించిందంటూ తప్పు లెక్కలూ, లేనిపోని అన్వేషణతో దుఃఖిస్తాం. విజ్ఞుడైన గురువును ఆశ్రయిస్తే విషయం విడమరిచి చెబుతారు. అది అర్థం చేసుకుని మనలో ఉన్న తప్పులు, పొరపాట్లను సరిదిద్దుకుంటే సమస్య ఉండదు. శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతాం.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని