మూడు అంగళ్లు

ఒక తండ్రి చనిపోతూ విలువైన వజ్రాన్ని కొడుకు రత్నదీపుడి చేతిలో పెట్టాడు. అతడు దాన్ని తీసుకుని శ్రేష్ఠి వద్దకు వెళ్లాడు. ఆ వజ్రం అమూల్యమన్నా డతడు.

Published : 20 Jul 2023 01:10 IST

ఒక తండ్రి చనిపోతూ విలువైన వజ్రాన్ని కొడుకు రత్నదీపుడి చేతిలో పెట్టాడు. అతడు దాన్ని తీసుకుని శ్రేష్ఠి వద్దకు వెళ్లాడు. ఆ వజ్రం అమూల్యమన్నా డతడు. జీవనం కష్టంగా ఉందని చెప్పగా- ‘నాకు మూడు పెద్ద అంగళ్లున్నాయి. మొదటి దాంట్లో విలువైన వజ్రాలుంటాయి. అక్కడ నీకు 18 నిమిషాల వ్యవధి. రెండోదాంట్లో చిత్రమైన సామగ్రి ఉంటుంది. అక్కడ 25 నిమిషాల సమయం. మూడోదాంట్లో అధునాతన వస్తువులున్నాయి. అక్కడ 30 నిమిషాలు. ఈ నిర్ణీత కాలవ్యవధిలో ఎన్ని వస్తువులు ఎంచుకుంటావో అవన్నీ నీవే. సమయం మించితే మట్టుకు ఇక ఏదీ నీది కాదు, అలాగే ఈ రత్నమూ నాదే అవుతుంది’ అన్నాడు శ్రేష్ఠి. రత్నదీపుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక అమూల్యరత్నాన్ని పోగొట్టుకున్నాడు.

శ్రేష్ఠి చెప్పిన 3 అంగళ్లు వయసుకు ప్రతీకలు. 18 ఏళ్ల వరకు దేని విలువా తెలియదు. 25 వరకూ భోగలాలసల దృష్టే కానీ దైవంవైపు చూడరు. అక్కడి నుంచి మరో 30 వచ్చేసరికి దేహంలో శక్తి తగ్గడం మొదలవుతుంది. సంసార బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేయడంతో దైవారాధనకు సమయం కేటాయించలేరు. ఇలా అమూల్య సమయాన్ని చేజార్చుకోవడం సరికాదు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి- అంటూ అరవిందో ఒక సందర్భంలో శిష్యులకు చెప్పిన కథ ఇది.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని