లోహితాక్షః

విష్ణుసహస్రనామావళిలో ఇది 58 వది. ‘లోహితాక్షః’ అంటే.. ఎర్ర తామర పూవుల్లా సుందరమైన ఎర్రని కనులు కలవాడు అనేది సామాన్యార్థం. అన్నిటినీ చూడగలిగేవి కళ్లు.

Published : 27 Jul 2023 00:05 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 58 వది. ‘లోహితాక్షః’ అంటే.. ఎర్ర తామర పూవుల్లా సుందరమైన ఎర్రని కనులు కలవాడు అనేది సామాన్యార్థం. అన్నిటినీ చూడగలిగేవి కళ్లు. అలాంటి నయనాలు అందంగా ఉన్నాయని వర్ణించటంలో ఆ స్వామి సర్వాన్నీ ఎంతో నిశితంగా చూడగలుగుతుంటాడు, ఆ చూపుల నుంచి తప్పించుకోవటం ఎవరి వల్లా కాదని భావం. అంటే స్వామికి నచ్చే ధర్మకార్య నిర్వహణలో లేదా భక్తి వైరాగ్య మార్గంలో ఉంటే మంచిదే! కానీ అధర్మాచరణలో ఉంటే మాత్రం.. అంతా గమనిస్తున్న ఆ స్వామి ఊరుకోడు.. జాగ్రత్త సుమా- అనే హెచ్చరికను ఇక్కడ అందిపుచ్చుకోవాలి. అలాగే ఆ చూపులు అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాయనే భావాన్ని కూడా గ్రహించాలి.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని