స్వర్గంలో నాయకురాలు

ప్రవక్త గారాల కుమార్తె హజ్రత్‌ ఫాతిమా(ర.అ) ఒకసారి తండ్రి ముహమ్మద్‌ ప్రవక్త(సఅసం) ఇంటికెళ్లగా ‘రా అమ్మా!’ అంటూ స్వాగతం పలికారాయన. పక్కన కూర్చోబెట్టుకుని, ఆమె చెవిలో ఏదో చెప్పారు.

Updated : 03 Aug 2023 04:32 IST

ప్రవక్త గారాల కుమార్తె హజ్రత్‌ ఫాతిమా(ర.అ) ఒకసారి తండ్రి ముహమ్మద్‌ ప్రవక్త(సఅసం) ఇంటికెళ్లగా ‘రా అమ్మా!’ అంటూ స్వాగతం పలికారాయన. పక్కన కూర్చోబెట్టుకుని, ఆమె చెవిలో ఏదో చెప్పారు. అది విని ఆమె ఏడుపు మొదలెట్టారు. మళ్లీ దైవప్రవక్త(స) ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పారు. ఈసారామె నవ్వారు. ప్రవక్త(స) పరమపదించిన తర్వాత.. గతంలో తండ్రిగారు చెవిలో చెప్పిన విషయం గురించి అడిగినవారికి.. ‘అమ్మా! హజ్రత్‌ జిబ్రాయీల్‌ దూత ప్రతి సంవత్సరం నాతో ఒకసారే ఖురాన్‌ పారాయణ చేయించేవారు. ఈ ఏడాది రెండుసార్లు పారాయణ చేయించారు. అందువల్ల నా మరణకాలం సమీపించిందనే ఆలోచన దృఢ మైంది. అయితే మన కుటుంబసభ్యుల్లో అందరికన్నా ముందు వచ్చి నన్ను కలుసుకునేది నువ్వే’ అన్నారు. ఆ మాట వినగానే దుఃఖం వచ్చింది. అప్పుడాయన ‘స్వర్గంలోని స్త్రీలకు నువ్వే నాయకురాలివి అవుతావు. ఇది నీకు సంతోషం కాదా?’ అన్నారు. ఆ మాట విని నవ్వేశాను’ అంటూ చెప్పారామె.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని