కోరికలు తీర్చే కప్పస్తంభం

వరాహ లక్ష్మీనరసింహస్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్న ఆలయం సింహాచల క్షేత్రంలో ఉంది. ఇక్కడ స్వామివారు చందనంతో కప్పి ఉంటారు. ఏటా అక్షయ తృతీయ నాడు మాత్రమే ఆయన నిజరూప దర్శనం కలుగుతుంది.

Updated : 03 Aug 2023 12:47 IST

రాహ లక్ష్మీనరసింహస్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్న ఆలయం సింహాచల క్షేత్రంలో ఉంది. ఇక్కడ స్వామివారు చందనంతో కప్పి ఉంటారు. ఏటా అక్షయ తృతీయ నాడు మాత్రమే ఆయన నిజరూప దర్శనం కలుగుతుంది. స్వామి వరాహ ముఖం, మానవ శరీరం, సింహపు తోకతో దర్శనమిస్తాడు. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ప్రాకారంలో ఉన్న కప్ప స్తంభానికి మూలవిరాట్టుతో సమానమైన విశిష్టత ఉంది. ఏదైనా సంకల్పం చేసుకుని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసు కుంటారు. ఆ తర్వాతే ఆలయంలోకి వెళ్తారు. కప్పం అంటే పన్ను, రుసుము, మొక్కు అనే అర్థాలున్నాయి. వస్తురూపంలో లేదా ధన రూపేణా కప్పం చెల్లించి, మొక్కులు తీర్చుకుంటారు. అందుకే దీనికి కప్పస్తంభం అనే పేరు స్థిరపడింది. ఈ స్తంభం దిగువన సంతాన గోపాల యంత్రాన్ని ప్రతిష్ఠించినందున దంపతులకు సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తమ ఆశ నెరవేరిన తర్వాత మగపిల్లాడు పుడితే కోడె దూడను, ఆడపిల్ల పుడితే ఆవు దూడను స్వామి వారికి బహుమానంగా సమర్పించడం ఇక్కడి ఆచారం.

సుంకి శ్రావణి, సింహాచలం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని