తల్లిని గౌరవించిన ఏసు

ఈ పుడమిపై దేవుడు మనిషిలా పుట్టాలనుకున్నప్పుడు మరియ కన్య గర్భాన్ని ఎంచుకున్నాడు. ఫాన్సు దేశం లూర్దెస్‌ నగరంలో బీడుభూమిలోనున్న గుహలో యమ్మ బెర్నదత్త అనే అమ్మాయి మరియ మాతను చూసింది.

Published : 17 Aug 2023 00:08 IST

పుడమిపై దేవుడు మనిషిలా పుట్టాలనుకున్నప్పుడు మరియ కన్య గర్భాన్ని ఎంచుకున్నాడు. ఫాన్సు దేశం లూర్దెస్‌ నగరంలో బీడుభూమిలోనున్న గుహలో యమ్మ బెర్నదత్త అనే అమ్మాయి మరియ మాతను చూసింది. అప్పట్నుంచీ ఆమె లూర్దుమాతగా ప్రసిద్ధం. దేశం నలుమూలల నుంచీ జాతి, కుల తారతమ్యం లేకుండా వచ్చి మాతను దర్శించుకొని అంతులేని ఆనందం పొందారు. ఇక ప్రభువు తన తల్లినెంతో గౌరవించాడు.

  • కానాలో పెళ్లికి వెళ్లినప్పుడు విందులో ద్రాక్షరసం మధ్యలో అయిపోయింది. కొందరు దాన్ని అవమానంగా భావించగా.. అది చూడలేక మరియ ఏసుకు చెప్పింది. తల్లి మాటను గౌరవించి బానల్లో నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి ఆమె ముఖంలో సంతృప్తిని చూశాడు. అది చూసి మరియమ్మతో పాటు బంధులోకమూ సంతోషించింది.
  • ఏసు సిలువపై మరణించే సమయంలో, తన చిన్నారి ప్రియ శిష్యుడు యోహానుని చూసి ‘ఇదిగో నీ తల్లి’ అంటూ చెప్పాడు ఏసుప్రభువు. అంటే దైవ కుమారుడు తన తల్లిని లోకానికి అప్పగించాడు. దైవమాత లోకమాత అయ్యింది.
  • తల్లిదండ్రులు కంటికి కనిపించే దేవుళ్లని పెద్దలు చెబుతారు. ‘మాతృదేవో భవ.. పితృదేవో భవ’ అంటూ పసి వయసులోనే నేర్పిస్తారు. తల్లి మరియను ఆరాధించిన ఏసు మనకు ఆదర్శం.                                        

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని