చేసిన పాపాలు దాచొద్దు

యెహోషువా నాయకత్వంలో ఇజ్రాయెల్‌ వాసులు యెరికోపై విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో హోయి పట్టణాన్ని కూడా ఆక్రమించుకుందామని వెళ్లారు.

Updated : 31 Aug 2023 01:03 IST

యెహోషువా నాయకత్వంలో ఇజ్రాయెల్‌ వాసులు యెరికోపై విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో హోయి పట్టణాన్ని కూడా ఆక్రమించుకుందామని వెళ్లారు. కానీ తీవ్ర భంగపాటు ఎదురైంది. కారణం దేవుడైన యెహోవా వారికి దూరమయ్యాడు. యెహోషువా దుఃఖంతో దైవం ముందు సాష్టాంగపడి కన్నీటితో ప్రార్థించగా.. దేవుడు ప్రసన్నుడై- ‘మీరు యెరికోలో విజయం సాధించాక, శపితమైన అక్కడి ఆస్తుల్లో దేన్నీ కూడా తాకకూడదని ఆజ్ఞాపించాను. కానీ మీలో ఓ వ్యక్తి అక్కడి వెండి బంగారాలు దొంగిలించి ఓ డేరా దగ్గర దాచాడు. అందుకే ఈ ఎడబాటు’ అంటూ వివరించాడు. విషయం తెలిసిన యెహోషువా- దోషి అయిన ఆకానుకు శిక్ష విధించాడు. ఆ శిక్ష ప్రకారం ఆ కుటుంబం మొత్తాన్ని, వారి పశువుల మందతో సహా రాళ్లతో చావగొట్టారు. దైవాజ్ఞను మీరిన ఫలితమది. మనం కూడా నిరాశా నిస్పృహలకు గురైనప్పుడు ప్రభువును ఆశ్రయించాలి. అలాగే చేసిన పాపాన్ని దాచిపెట్టక.. పశ్చాత్తాపం చెంది ప్రభువు పాదాలను ఆశ్రయిస్తే.. క్షమాపణ తప్పక లభిస్తుంది.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని