పిల్లల మీదుగా దూకేస్తాడు..
స్పెయిన్ దేశంలో కాస్ట్రిల్లో డి ముర్సియా ప్రాంతంలో చేసే కార్పస్ క్రీస్టీ.. ఎల్ కొలాచో ఉత్సవాల్లో వింతలూ, విశేషాలూ చోటు చేసు కుంటాయి. ఇవి 16వ శతాబ్దంలో మొదలయ్యాయి.
స్పెయిన్ దేశంలో కాస్ట్రిల్లో డి ముర్సియా ప్రాంతంలో చేసే కార్పస్ క్రీస్టీ.. ఎల్ కొలాచో ఉత్సవాల్లో వింతలూ, విశేషాలూ చోటు చేసు కుంటాయి. ఇవి 16వ శతాబ్దంలో మొదలయ్యాయి. ఏడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో ‘బేబీ జంపింగ్’ ముఖ్యమైన ఆచారం. ఇందులో ఏడాది వయసున్న చిన్నారులను వీధిలో పరుపు మీద పడుకోబెడతారు. ఒక వ్యక్తి ఎరుపు, పసుపు వస్త్రాలు, ముఖానికి తొడుగు ధరించి భయానకంగా కనిపిస్తాడు. అతడు పట్టణమంతా పరుగులు పెడుతూ.. పడుకోబెట్టిన చిన్నారుల మీదుగా అవతలికి దూకుతాడు. అలా దూకుతుంటే ఇతరులు ఉత్సాహపరుస్తారు. వింటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! ఇలాంటి భయంతోనే.. ‘పొరపాటున చంటి బిడ్డ మీద కాలు పడితే ఎలా?’ అని- ఓ వ్యక్తి అడిగితే- ‘ఎట్టి పరిస్థితిలో అలా జరగదు.. నేను తర్ఫీదు తీసుకున్నాను. ఈ పండుగకు నెల ముందే పొగ తాగడం లాంటివన్నీ మానేసి పవిత్రంగా, అప్రమత్తంగా ఉంటాను’ అని చెబుతాడతను. ఇలా చేయడం వల్ల పిల్లలకు భూత ప్రేత పిశాచాల పీడ ఉండ దని, అంతా శుభమే చేకూరుతుందని వాళ్ల ప్రగాఢ నమ్మకం. అతడు దాటిన తర్వాత పిల్లల మీద గులాబీ రేకలు జల్లి హర్షం వ్యక్తం చేస్తారు. ఎల్ కొలాచో ఉత్సవాలను చూసేందుకు వివిధ దేశాల ప్రజలు అక్కడికి వస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM modi: గహ్లోత్‌కు ఓటమి తప్పదని అర్థమైంది: మోదీ
-
Mexico: చర్చి పైకప్పు కుప్పకూలి.. ముగ్గురు చిన్నారులు సహా 10 మంది మృతి!
-
Nara Bhuvaneswari: నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది: నారా భువనేశ్వరి ట్వీట్
-
Disease X: ‘డిసీజ్ ఎక్స్’ ముప్పు.. దొంగ వస్తాడని భయపడటం లాంటిదే..!
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Chiranjeevi: ఛారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్