పద్దు.. రద్దు..
ఓ శిష్యుడు ‘గురువర్యా! మాట నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? దేవుడు అన్నీ గమనిస్తుంటాడా?’ అనడిగాడు. అవతార్ మెహర్ బాబా నవ్వి.. ‘నేనో కథ చెబుతాను విను! ఒక విద్యార్థికి గణితంలో పట్టులేకపోవడంతో గుడిలో దేవుణ్ణి దర్శించుకుని, పరీక్షలో తనను గట్టెక్కిస్తే పులిహోర, చక్రపొంగలి, దద్దోజనం సమర్పించు కుంటానని మొక్కుకున్నాడు.
ఓ శిష్యుడు ‘గురువర్యా! మాట నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? దేవుడు అన్నీ గమనిస్తుంటాడా?’ అనడిగాడు. అవతార్ మెహర్ బాబా నవ్వి.. ‘నేనో కథ చెబుతాను విను! ఒక విద్యార్థికి గణితంలో పట్టులేకపోవడంతో గుడిలో దేవుణ్ణి దర్శించుకుని, పరీక్షలో తనను గట్టెక్కిస్తే పులిహోర, చక్రపొంగలి, దద్దోజనం సమర్పించు కుంటానని మొక్కుకున్నాడు. మర్నాడు పరీక్షలో ప్రశ్నలన్నీ తెలిసినవే వచ్చాయి. దేవుడు తన మొర విన్నందుకు మనసులోనే ధన్యవాదాలు చెప్పి వేగంగా పరీక్ష ముగించేశాడు. మిగిలిన సమయాన్ని వృథా చేయడం ఎందుకని అదనంగా ఉన్న కాగితం మీద దేవుడికి సమర్పించదలచుకున్న నైవేద్యాలకు అవసరమయ్యే సరుకుల వివరం రాశాడు. ఆ జాబితా చూస్తూ- దేవుడికి కారం, పులుపు పడవంటారు కనుక పులిహోరలో మిరపకాయలు, చింతపండు రద్దు అనుకుని వాటిని కొట్టేశాడు. స్వామికెటూ ఆర్భాటాలు నచ్చవు కనుక పులిహోర, చక్రపొంగలిలో ఖరీదైన జీడిపప్పు, ఎండుద్రాక్షలు అవసరంలేదని వాటిని తీసేశాడు. పొంగలికి రాసిన పంచదారను సగానికి తగ్గించాడు. అంతలోనే అసలివన్నీ ఎందుకు? పత్రం, పుష్పం, ఫలం,తోయం- అన్నారు.. అవి సరిపోతాయిలెమ్మని మిగిలినవీ కొట్టేశాడు. వాటిలోనూ మొదటి మూడింటినీ కొనాల్సివస్తుందని అవీ అవసరంలేదు, ఖర్చు లేకుండా దొరికే నీరు సమర్పిస్తే చాలని నిశ్చయించాడు. అంతలో పరీక్షా నిర్వాహకుడు సమాధానపత్రం కోసం రాగా.. అతడు- ‘పూజా సామాను పద్దు.. రద్దు..’ కాగితం ఇచ్చి, సమాధాన పత్రం చింపేశాడు. దేవుణ్ణి మోసం చేయబోయి తనే మోస పోయాడు. ఇప్పుడు చెప్పు.. దేవుడన్నీ గమనిస్తాడా లేదా?’ అన్నారు.
డాక్టర్ జయదేవ్ చల్లా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Chiranjeevi: ఛారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Festival shopping: మెగా సేల్స్‌కు రెడీనా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
-
Crime News: ఖాకీ తెలివి.. హత్యచేసి.. ఆపై బతికుందని రెండేళ్లు నమ్మించి..!
-
Pawan Kalyan: గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది: పవన్