Marriage: పెళ్లి కాలేదంటే.. అంతే ఇక!
రాముడు, శివుడు, కృష్ణుడు.. అందరినీ సతీసమేతంగా పూజిస్తాం. మన సంస్కృతిలో ఏ కార్యక్రమాలైనా.. ఆలుమగలు కలిసి నిర్వర్తించాలనే నియమం ఉంది. జీవితంలో పెళ్లికి అంత ప్రాముఖ్యముంది.
రాముడు, శివుడు, కృష్ణుడు.. అందరినీ సతీసమేతంగా పూజిస్తాం. మన సంస్కృతిలో ఏ కార్యక్రమాలైనా.. ఆలుమగలు కలిసి నిర్వర్తించాలనే నియమం ఉంది. జీవితంలో పెళ్లికి అంత ప్రాముఖ్యముంది. ధర్మానుచరణలో ఒకరికొకరు తోడూనీడగా ఉండాలనేదే అంతరార్థం. వైవాహిక జీవిత ఆవశ్యకతను చాటుతూ డెన్మార్క్‌లో ఒక చిత్రమైన ఆచారం ఉంది. పాతికేళ్లు నిండినా.. ఇంకా పెళ్లి కాలేదంటే.. అభిషేకం చేసినట్లుగా తల మీద నీళ్లు కుమ్మరిస్తారు. తర్వాత తల నుంచి పాదాల వరకూ దాల్చిన చెక్క పొడి జల్లుతారు. ఇందులో స్త్రీ పురుష వ్యత్యాసం లేదు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. ఆ దేశంలో వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీని వల్ల ఫలితం ఏమిటో తెలియకున్నా.. ఎవరూ వ్యతిరేకించరు, శిక్షగా భావించరట. నయం.. ఇలా మనదేశంలో లేనందుకు సంతోషిద్దాం.. దాల్చినచెక్క చాలా ఖరీదు మరి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘విస్తరణ’ దారిలో విపరీత బుద్ధులు!
-
ఖరము పాలు ఖరీదు గురూ!
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!