ఎంచుకోవాల్సిన మార్గం..

మనలో కొంతమంది క్షణికానందం ఇచ్చే అంశాలతో కాలక్షేపం చేసి ఆనందిస్తారు. కొందరు అశ్లీల కార్యకలాపాలు, మత్తు పానీయాలు లాంటి వ్యసనాలకు బానిసలవు తుంటారు.

Published : 21 Sep 2023 00:25 IST

నలో కొంతమంది క్షణికానందం ఇచ్చే అంశాలతో కాలక్షేపం చేసి ఆనందిస్తారు. కొందరు అశ్లీల కార్యకలాపాలు, మత్తు పానీయాలు లాంటి వ్యసనాలకు బానిసలవు తుంటారు. అలా మంచి చెడుల విచక్షణ కోల్పోయి.. అవినీతి మార్గంలో సాగు తుంటారు. దాన్నే ప్రభువు విశాల మార్గమని (మత్తయి 7:13,14) వివరించారు. ఇక ఇరుకు మార్గం గురించి చెప్పాలంటే.. ఏసుక్రీస్తు బోధలు చిత్తశుద్ధితో పాటిస్తూ, ఆయన గీసిన గిరిలోనే హద్దు మీరకుండా మనుగడ సాగించడం. కాని పనులకు దూరంగా ఉంటూ, పరలోక రాజ్యం గురించిన ఆలోచనలతో.. పరిశుద్ధతను ఆకాంక్షిస్తూ జీవించడం. ఈ ఇరుకుమార్గంలో పయనించడం కొంచెం కష్టమే. కానీ.. ఓర్పుగా, నేర్పుగా ఆ మార్గంలో సాగితే.. చివరికి క్రీస్తు సాంగత్యం లభిస్తుంది. పరలోక రాజ్యంలో స్థానమూ లభిస్తుంది. కనుక మనం క్షణికానందానికి లోనై విశాల మార్గాన్ని ఎంచుకున్నట్లయితే చివరికి నరకం ప్రాప్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏ మార్గంలో పయనిస్తే క్షేమమో ఎవరికి వారే విజ్ఞతతో నిర్ణయించుకోవాలి.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని