ఆదివిష్ణువే అనంత పద్మనాభుడు!
అనంతం అంటే ఆకాశం. శ్రీమహావిష్ణువు అంతటా ఉన్నాడు. అనంతుడంటే సహస్ర ఫణీంద్రుడైన నాగేంద్రుడు.
సెప్టెంబరు 28 అనంత పద్మనాభ వ్రతం
అనంతం అంటే ఆకాశం. శ్రీమహావిష్ణువు అంతటా ఉన్నాడు. అనంతుడంటే సహస్ర ఫణీంద్రుడైన నాగేంద్రుడు. శేషశయనుడైన శ్రీమన్నారాయణుడు పవళించి ఉండగా ఆయన నాభి నుంచి పద్మం ఉదయించింది. అందులోంచి బ్రహ్మ నాలుగు వేదాలు చేతపట్టి సృష్టి చేసేందుకు సిద్ధమయ్యాడు. కమలలోచనుడు శ్రీహరి కొడుకు కమలానుడు అయిన విరించి వల్ల ఈ ప్రపంచం కమలంలా విరబూసింది.
ఆనందానికి, సిరిసందపలకు ఆదిమూలమైన అనంతపద్మనాభ స్వామి వ్రతాన్ని 14 రోజులు భక్తిశ్రద్ధలతో పాటించడం ఆనవాయితీ. పూజానంతరం 14 ముడుల తోరం కట్టుకోవడం సంప్రదాయం. పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి కట్టుకుంటారు. కొత్త దంపతులు ఈ వ్రతం ఆచరించి తమ దాంపత్యం అన్యోన్యంగా సాగాలని ఆకాంక్షిస్తారు.
దక్షిణ భారతంలో పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రాలు ప్రఖ్యాతమైనవి ఉన్నాయి. కేరళ తిరువనంతపురంలో అనంతశయనంగా సుప్రసిద్ధం. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు శేషశాయిగా కనువిందు కలిగిస్తాడు. పద్మనాభ స్వామి వ్రతానికి సంబంధించి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. సుమంతుడి కూతురు సుశీలను పెళ్లాడిన కౌండిన్య మహర్షి- పద్మనాభ వ్రతం ఆచరించాడు. ఒకసారి కౌండిన్యుడు కోపావేశంలో సుశీల చేతి కంకణం తీసి అగ్నికుండంలో విసిరాడు. సగం కాలిన ఆ తోరాన్ని ఆమె మళ్లీ కట్టుకుంది. కొన్నాళ్లకు కౌండిన్యుడు సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తంగా పద్మనాభస్వామిని శరణు కోరాడు. మరోసారి దీక్షగా వ్రతం చేయగా.. స్వామి కటాక్షించాడు. దీన్ని బట్టి.. పురుషార్థాలు పాటిస్తూ, దాన ధర్మాలు చేస్తే.. పద్మనాభస్వామి అనుగ్రహం కలుగుతుందని, అలా ఆనంద మకరందం ఆస్వాదిస్తూ జీవితాన్ని నందనవనంగా మార్చుకోవచ్చునని స్పష్టమవుతుంది.
ఉప్పు రాఘవేంద్ర రావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.21 వేల లాభం
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
-
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత