మహా వైద్యుడాయన!
లోకంలో మొట్టమొదటి వాడైన ఆదాముకు దేవుడు గాఢనిద్ర కల్పించి, పక్కటెముక తీశాడు. ఆ వెలితిని మాంసంతో పూడ్చేశాడు.
లోకంలో మొట్టమొదటి వాడైన ఆదాముకు దేవుడు గాఢనిద్ర కల్పించి, పక్కటెముక తీశాడు. ఆ వెలితిని మాంసంతో పూడ్చేశాడు. అయినా ఆదాముకు నొప్పి (ఆది 2:21) కలగలేదు, మెలకువ రాలేదు. వైద్య పరిభాషలో చెప్పాలంటే యెహోవా మత్తుమందు నిపుణుడిగా, శస్త్రవైద్యునిగా- రెండు పనులు నిర్వహించాడు. అలా తీసిన ఎముకను స్త్రీగా రూపొందించి, ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక జీవి జన్మించాలంటే రెండు జీవుల కలయిక తప్పనిసరి. కానీ ఎముకతో జీవిని సృష్టించడం అసంభవం. బైబిల్‌ను విశ్వసించని వాళ్లు దీన్నెలా నిరూపిస్తారు? శతాబ్దాల తర్వాత క్లోనింగ్ ప్రక్రియ కనిపెట్టారు. ఈ శాస్త్రీయ అంశానికి సంబంధించి ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. దేవుడు ఆ పని ఎన్నడో చేశాడు. అలాగే కన్య అయిన మరియ గర్భం దాల్చింది. ‘అది పరిశుద్ధాత్మ మహిమ అని, ఆమెని అవమానించ వద్దు’ అని (మత్త 2:20) మరియ భర్తకు ప్రభువు వివరించాడు. ఏ పరీక్షలూ చేయకుండానే గర్భిణి అని, మగ శిశువు పుడతాడని చెప్పాడు. అలా ప్రసూతి నిపుణుడు అయ్యాడు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు.. వైద్యులకే వైద్యుడు. కనుక ఏదైనా అనారోగ్యం కలిగితే ఏసుక్రీస్తును స్మరించి, ఉపశమనం పొందుదాం.
మర్రి ఎ.బాబ్జి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
-
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్