సౌందర్యం కాదు సహృదయం ప్రధానం!

చాణక్యుడు, చంద్రగుప్తుడు ఓ సారి శాస్త్ర చర్చల్లో మునిగి ఉన్నారు. లోతైన భావాలతో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి ఆశ్చర్యచకితుడిని చేశాడు. ఆ సంభ్రమాశ్చరాలతోనే మహారాజు ‘మీలో విద్వత్తు, వ్యవహార జ్ఞానం, వాక్చాతుర్యాలు అపారంగా ఉన్నాయి.

Published : 05 Oct 2023 00:27 IST

చాణక్యుడు, చంద్రగుప్తుడు ఓ సారి శాస్త్ర చర్చల్లో మునిగి ఉన్నారు. లోతైన భావాలతో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి ఆశ్చర్యచకితుడిని చేశాడు. ఆ సంభ్రమాశ్చరాలతోనే మహారాజు ‘మీలో విద్వత్తు, వ్యవహార జ్ఞానం, వాక్చాతుర్యాలు అపారంగా ఉన్నాయి. వాటితో పాటు అందం కూడా ఉంటే బంగారానికి తావి అబ్బినట్లు ఉండేది’ అన్నాడు. వెంటనే చాణక్యుడు సేవకుడితో ఓ మట్ల్టిపాత్రలో, ఓ బంగారుపాత్రలో మంచినీరు తెప్పించాడు. రెండు పాత్రల్లో నీళ్లు తెచ్చాక.. చంద్రగుప్తుణ్ణి తాగమన్నాడు. ఎందుకో అర్థం కాకపోయినా, మంత్రి మాట విని కొద్ది కొద్దిగా నీళ్లు తాగాడు. ‘ఏ పాత్రలోని నీళ్లు చల్లగా ఉన్నాయి మహారాజా!’ అనడిగాడు చాణక్యుడు. ‘మట్టిపాత్రలోని నీరు’ అని బదులిచ్చాడు మహారాజు. అప్పుడు ‘చూశావా! రాజా! బయటకు తళతళమని మెరుస్తున్నా బంగారు పాత్రలో నీరు మృణ్మయపాత్రలో నీరులా చల్లగా లేదు. నీళ్లను చల్లబరిచే స్వభావం మట్టిపాత్రకే ఉంది. అలాగే వ్యక్తి సచ్ఛీలత, సరళత్వం, ప్రసన్నతలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి. అందచందాలు, వాగ్ధాటి చూసి కాదు. భగవంతుడు మెచ్చేది బాహ్యసౌందర్యాన్ని కాదు.. ఆంతరంగిక సౌందర్యాన్నే’ అన్నాడు చాణక్యుడు. చంద్రగుప్తుడు తన తప్పిదాన్ని తెలుసుకొని ఆ మహామంత్రిని క్షమాపణ కోరాడు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని