భిన్నత్వంలో ఏకత్వం

ఓ కుక్క ఆలయంలో ఉన్న అద్దాల మందిరంలోకి వెళ్లింది. వాటిల్లో తన ప్రతిబింబాలు చూసి.. అనేక శునకాలు అనుకుంది. అవి తనపై దాడి చేస్తాయనే భయంతో అరిచి, పైపైకి ఎగరడంతో ఒళ్లంతా గాయాలై.. మరణించింది.

Published : 12 Oct 2023 00:06 IST

కుక్క ఆలయంలో ఉన్న అద్దాల మందిరంలోకి వెళ్లింది. వాటిల్లో తన ప్రతిబింబాలు చూసి.. అనేక శునకాలు అనుకుంది. అవి తనపై దాడి చేస్తాయనే భయంతో అరిచి, పైపైకి ఎగరడంతో ఒళ్లంతా గాయాలై.. మరణించింది. జ్ఞానం ఉన్నట్లయితే అద్దాల్లో కనిపించేవి ప్రతిబింబాలేనని గుర్తించగలరు. అది లేని శునకం గ్రహించలేక చనిపోయింది. అద్దాల్లో ప్రతిబింబాల మాదిరిగా పరమాత్మ స్వరూపమే భిన్నమైన రూపాలతో అనేకంగా ప్రవర్తిల్లుతోంది- అని గ్రహించగలిగితే.. ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తాం. అలా కాకుండా అందరూ వేరు వేరు అని భావిస్తే.. ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతాం. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటాం. గీతలో శ్రీకృష్ణుడు ‘అవిభక్తం విభక్తేషు’ అన్నాడు. ప్రపంచంలో భిన్నమైన వస్తువంటూ ఏదీ లేకపోవడమే సత్యమని, అనేకంలో ఏకత్వాన్ని చూడాలనేది అంతరార్థం. భిన్న దృష్టి వల్ల.. కోపం, మోహం, రోషం, ఆవేశం పెరగడమే తప్ప మరో ప్రయోజనం లేదు. అన్నిటిలో, అందరిలో తనని తాను చూసుకునే వ్యక్తి సకల జీవుల పట్ల దయ, కరుణ కలిగి ఉంటూ దైవత్వాన్ని సాధిస్తాడు. సకల సృష్టీ ఏకత్వమైన పరమాత్మ స్వరూపమే. ఆదిశంకరులు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతమూ ఇదే.. ఒక సందర్భంలో శిష్యుడు అడిగిన సందేహానికి పుట్టపర్తి సాయిబాబా ఇలా జవాబిచ్చారు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని