క్రీస్తు ప్రక్షాళన చేస్తాడు!

శరదృతువులో ఆకులు రాలిన చెట్లు.. వసంత రుతువు కోసం ఎదురుచూస్తాయి. మనం కూడా ప్రభువు రక్షణ మార్గం తెలుసుకుని.. పాత జీవితాన్ని వదిలి, కొత్త జీవితం కోసం సిద్ధపడాలి. ఈ ప్రక్రియ ఒక్క క్షణంలో రాదు.

Published : 12 Oct 2023 00:05 IST

రదృతువులో ఆకులు రాలిన చెట్లు.. వసంత రుతువు కోసం ఎదురుచూస్తాయి. మనం కూడా ప్రభువు రక్షణ మార్గం తెలుసుకుని.. పాత జీవితాన్ని వదిలి, కొత్త జీవితం కోసం సిద్ధపడాలి. ఈ ప్రక్రియ ఒక్క క్షణంలో రాదు. దాని కోసం శరీరాన్ని నలగ్గొట్టుకోవాలి. కామ, క్రోధ, మద, మాత్సర్యాలనే పాత ఆకుల్ని రాల్చి, దైవం ముందు మోకరిల్లి- మారు మనసు కోసం ప్రార్థించాలి.

ఎవరికి వారే తాము నిజాయితీపరులమనీ, దైవాజ్ఞ పాటిస్తున్నామనీ అనుకుంటారు. పరలోక రాజ్యంలో ముందు వరుసలో ఉంటామనుకుంటారు. ఈ సందర్భంగా ఏసు చెప్పిన ఉదంతం గుర్తుచేసుకుందాం. ఓ ధనవంతుడు- పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఏం చేయాలని అడిగాడు. దేవుడిచ్చిన దశాజ్ఞలను పాటించమన్నాడు ప్రభువు. అప్పుడతడు ‘అవన్నీ పాటిస్తూనే ఉన్నానుగా’ అన్నాడు. ‘అయితే నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి, నువ్వు నన్ను అనుసరించు’ అన్నాడు. మహా ఆస్తిపరుడైన అతడు ముఖం చిన్నబుచ్చుకుని (మత్తయి 19:16-22) వెళ్లిపోయాడు. మనం కనుక చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కొత్త జీవితాన్ని చిగురింప చేసుకోవచ్చు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందినప్పుడు క్రీసు వాటిని ప్రక్షాళన చేస్తాడు. అలా ఆ ధనికుడు ఆశించిన పరలోక రాజ్యాన్ని కూడా పొందగలం.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని