చర్చిలోకి పద!

మన జీవితాలు సవ్యంగా, సంతోషంగా గడవాలన్నదే ప్రభువు ఉద్దేశం. విశేషంగా, విశిష్టంగా బతికేందుకు మన శక్తి చాలదని ఆయనకు తెలుసు. అందుకే పరిశుద్ధ ఆత్మను మనకు సహకారిగా అనుగ్రహించాడు. పేతురు, యోహానులు చర్చిలోకి ప్రవేశించే సమయంలో.. కాళ్లు కుంటుపడిన ఒక బిచ్చగాడు కనిపించాడు.

Published : 26 Oct 2023 00:04 IST

మన జీవితాలు సవ్యంగా, సంతోషంగా గడవాలన్నదే ప్రభువు ఉద్దేశం. విశేషంగా, విశిష్టంగా బతికేందుకు మన శక్తి చాలదని ఆయనకు తెలుసు. అందుకే పరిశుద్ధ ఆత్మను మనకు సహకారిగా అనుగ్రహించాడు. పేతురు, యోహానులు చర్చిలోకి ప్రవేశించే సమయంలో.. కాళ్లు కుంటుపడిన ఒక బిచ్చగాడు కనిపించాడు. అతడు నాలుగు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నాడు. పేతురు, యోహానులు మందిరంలోకి వెళ్లబోతుంటే.. ఆ వికలాంగుడు వాళ్ల వద్ద ఏమైనా దొరుకుతుందేమోనని వారి వైపు ఆశగా చూశాడు. వాళ్లు ‘నీకు ఇచ్చేందుకు మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ.. మేం చేయగలిగిన మేలు చేస్తాం.. ముందు నువ్వు ఏసు వద్దకు నడువు’ అని- అతడి చెయ్యి పట్టుకుని లేవదీశారు. వెంటనే అతడు.. కాళ్లలో కొత్త శక్తి ఏదో ప్రవేశించినట్టు.. తనంతట తాను నిలబడ్డాడు. అతడు ఆనందం పట్టలేక ప్రభువును స్తుతిస్తూ మందిరంలోకి నడిచాడు. అది చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్లుగా మందిరం బయటే ఉన్నాడు కానీ ఏనాడూ లోనికి వెళ్లాలనే ఆలోచన రాలేదతడికి. చర్చిలోనికి వెళ్లి.. ఆరాధనలో పాల్గొంటే మేలు కలుగుతుందని రుజువు చేసిందా ఉదంతం.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని