ఉద్ధవుని మార్చేసిన గోపికలు

మధుర నుంచి వచ్చిన ఉద్ధవుని అడిగి, శ్రీకృష్ణుడి యోగక్షేమాలు తెలుసుకోవాలనుకున్నారు గోపికలు. కానీ నిర్గుణోపాసకుడైన ఉద్ధవుడు కృష్ణుడి పట్ల ప్రేమానురాగాలు వదిలి ముక్తి కోసం యోగవిద్య, జపతపాలు ఎంచుకోమన్నాడు.

Published : 02 Nov 2023 00:42 IST

ధుర నుంచి వచ్చిన ఉద్ధవుని అడిగి, శ్రీకృష్ణుడి యోగక్షేమాలు తెలుసుకోవాలనుకున్నారు గోపికలు. కానీ నిర్గుణోపాసకుడైన ఉద్ధవుడు కృష్ణుడి పట్ల ప్రేమానురాగాలు వదిలి ముక్తి కోసం యోగవిద్య, జపతపాలు ఎంచుకోమన్నాడు. దాంతో గోపికలు అతడిపై ఆగ్రహించారు.

కానీ అతడు అతిథి కాబట్టి ఏమీ అనకుండా అటుగా వచ్చిన భ్రమరాన్ని ఉద్దేశించి తమ భావాలన్నీ పంచుకున్నారు. తర్వాత ఉద్ధవునితో ‘నీది మోస పూరిత యోగవిద్య. ఎండు ద్రాక్షలను వదిలేసి.. వేపకాయలు తినేంత మూర్ఖులు ఇక్కడ లేరు. మేం కృష్ణుణ్ణి ఆరాధించాం. ప్రేమ అనే సులువైన దారిని అడ్డుకుని.. రాజమార్గంలో నిర్గుణోపాసన అనే ముళ్లు పరుస్తున్నావు. మాకు అనేక మనసులు లేవు. ఉన్నది ఒకటే. అది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది. ఇక ఎలా ఆరాధించాలి? కన్నయ్య లేనందున.. మా ఇంద్రియాలు బలహీనమయ్యాయి. శరీరంలో తల లేనట్లుంది’ అన్నారు. గోపికల అంతులేని ప్రేమను చూసిన ఉద్ధవుడు చలించిపోయాడు. తన అజ్ఞానాన్ని పోగొట్టేందుకే శ్రీకృష్ణుడు ఇక్కడికి పంపాడేమో- అనుకున్నాడు. తక్షణం కృష్ణభక్తుడిగా మారిపోయాడు. కవి సూరదాసు సగుణ భక్తిని ఇలా అద్భుతంగా వర్ణించాడు.

డా.నరసింహ రావు కల్యాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని