హింసలోనూ ఆనందించు!

ఒక భక్తుడు ‘క్రైస్తవమనేది ప్యారడాక్స్‌.. విపరీత సిద్ధాంతాలతో.. కూడిన బోధ’ అన్నాడు. ఈ సందర్భంగా ఏసు చెప్పిన ‘ఎవరైనా మిమ్మల్ని నిందించి, హింసించి నప్పుడు మీరు ఆనందించండి’

Published : 09 Nov 2023 00:41 IST

క భక్తుడు ‘క్రైస్తవమనేది ప్యారడాక్స్‌.. విపరీత సిద్ధాంతాలతో.. కూడిన బోధ’ అన్నాడు. ఈ సందర్భంగా ఏసు చెప్పిన ‘ఎవరైనా మిమ్మల్ని నిందించి, హింసించి నప్పుడు మీరు ఆనందించండి’ (మత్త 5:12) అనే వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే ఎవరైనా మనల్ని శత్రువుల్లా చూసినా సరే.. వారిని కూడా ప్రేమించమన్నాడు. సాధారణంగా ఒకరు బాధిస్తే.. దుఃఖిస్తామే కానీ ఆనందించలేం. కానీ ప్రభువు అలాంటి సమయాల్లో కూడా సంతోషించమనడం, విరోధుల్ని కూడా ఆత్మీయంగా చూడమనడం.. విపరీతంగానే తోస్తుంది. కానీ వాటిని పాటించడం వల్ల అద్భుత ఫలితాలు కలిగిన ఉదంతాలున్నాయి.

సాధు సుందర్‌సింగ్‌ అనే భక్తుడు ఓ బహిరంగసభలో బైబిల్‌ సంగతులు ఉపన్యసిస్తున్నప్పుడు- ఓ వ్యక్తి అతడి ముఖాన ఇసుక విసిరాడు. సింగ్‌ నోరు, కళ్లు, ముక్కులో పడిన ఇసుకను శుభ్రం చేసుకున్నాడు. ఇంతలో సభికులు అతణ్ణి బంధించగా- సింగ్‌ విడిచిపెట్టమన్నాడు. వారు కాదన్నా ఒప్పించాడు. దాంతో అతడు పశ్చాత్తాపం చెంది, క్షమించమంటూ సింగ్‌ను వేడుకున్నాడు. క్రమంగా ఏసు భక్తుడిగా మారాడు. ఇది ప్రభువు వాక్కు పాటించడం వల్లే సాధ్యమైంది.

ఎమ్‌.ఉషారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని