వీరేనా దైవరాజ్య వారసులు!

తన చుట్టూ ఉన్న పెద్దలకు.. అర్థం కాని ఆధ్యాత్మిక అంశాలను లోతుగా చర్చించి వివరించి చెప్పేవాడు ప్రభువు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. జనం తండోపతండాలుగా వచ్చి.. ఆ హితబోధలు వినేవారు. ఆయన ఆశీస్సుల కోసం చిన్నపిల్లల్ని ఎత్తుకొని మైళ్ల కొద్దీ నడిచి వచ్చేవారు. సుదూరంగా ఉన్న గ్రీసు ప్రాంతం నుంచి కూడా అక్కడికి చేరేవారు.

Published : 16 Nov 2023 00:16 IST

క్రీస్తువాణి

న చుట్టూ ఉన్న పెద్దలకు.. అర్థం కాని ఆధ్యాత్మిక అంశాలను లోతుగా చర్చించి వివరించి చెప్పేవాడు ప్రభువు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. జనం తండోపతండాలుగా వచ్చి.. ఆ హితబోధలు వినేవారు. ఆయన ఆశీస్సుల కోసం చిన్నపిల్లల్ని ఎత్తుకొని మైళ్ల కొద్దీ నడిచి వచ్చేవారు. సుదూరంగా ఉన్న గ్రీసు ప్రాంతం నుంచి కూడా అక్కడికి చేరేవారు. ప్రభువును తాకినా, ఆయన ఆశీర్వాదం పొందినా, సర్వ శుభాలూ కలుగుతాయని బలంగా నమ్మేవారు. ఒకసారి పరస్పరం తోసుకుంటూ వస్తున్న జనాల్ని, తమను ఏసు వద్దకు పంపమని బతిమాలుతున్న తల్లిదండ్రుల్ని ఏసు ప్రభువు గమనించాడు. శిష్యుల వంక చూసి.. ‘వాళ్లనెందుకు అడ్డుకుంటున్నారు? నా చెంతకు రానీయండి!’ అని మెల్లగా మందలించాడు. చిన్నారులను ముద్దాడి, అక్కున చేర్చుకొని.. ‘ఇలాంటివారిదే దేవుని రాజ్యం’ అంటూ తల నిమిరి, ఆశీర్వదించాడు. ‘వయసు పెరిగినా కూడా.. కపటం, కల్మషం లేకుండా పిల్లల్లా ఉండాలి. లేకుంటే దైవ రాజ్యం చేరుకోలేరు. మీరంతా పసిబిడ్డల్లా ఉండండి’ అంటూ ప్రబోధించాడు ఏసు.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని