దేవుడి చిత్తం ప్రకారం..

ఓ భక్తుడు ‘నేను మనసారా ప్రార్థిస్తాను. అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని ఒడుదొడుకులు వస్తున్నాయి?’ అనుకున్నాడు. దీనికి జవాబు ఏమిటంటే- దైవచిత్తాన్ని అర్థం చేసుకోకుండా, తనకు తోచిన నిర్ణయాలను అమలుచేయడమే. ఓ యువతి- తనకు నచ్చిన వ్యక్తి దేవుణ్ణి విశ్వసించడని తెలిసినా.. అతణ్ణే చేసుకోదలచింది. తర్వాత దైవమే అతన్ని మార్చుకుంటాడనుకుంది. ఇలా చేస్తే.. భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

Published : 23 Nov 2023 00:06 IST
క్రీస్తువాణి
భక్తుడు ‘నేను మనసారా ప్రార్థిస్తాను. అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని ఒడుదొడుకులు వస్తున్నాయి?’ అనుకున్నాడు. దీనికి జవాబు ఏమిటంటే- దైవచిత్తాన్ని అర్థం చేసుకోకుండా, తనకు తోచిన నిర్ణయాలను అమలుచేయడమే. ఓ యువతి- తనకు నచ్చిన వ్యక్తి దేవుణ్ణి విశ్వసించడని తెలిసినా.. అతణ్ణే చేసుకోదలచింది. తర్వాత దైవమే అతన్ని మార్చుకుంటాడనుకుంది. ఇలా చేస్తే.. భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. మన ప్రణాళిక మన దృష్టిలో ఉదాత్తమైందిగా తోచవచ్చు. కానీ దైవచిత్తాన్ని విస్మరించినప్పుడు ఇబ్బందులు తప్పవు. భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలిసిన దేవాధిదేవుని సూచన మేరకు ముందుకు సాగితే (యోహాను 2:17) ప్రమాదాలు తలెత్తవు. కారణం ప్రతి ఒక్కరి జీవితం పట్ల దైవానికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ‘ప్రభూ! నువ్వే నన్ను నడిపించు’ అని ప్రార్థించినప్పుడు.. ఆయన స్పందిస్తాడు. అంతేతప్ప బలవంతంగా తన ప్రణాళికను మనపై రుద్దడు. అది ఆయన సిద్ధాంతం. కనుక చిన్న, పెద్ద.. ఏ సమస్య ఎదురైనా- దైవాన్ని ఆశ్రయిస్తే.. మన జీవితం నల్లేరుపై బండిలా దివ్యంగా సాగిపోతుంది.
ఎమ్‌.ఉషారాణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని