ఏసు సుస్వరం

ప్రభువు కొన్ని సందర్భాల్లో మహా మౌనంగా ఉండేవాడు. మాట్లాడకుండా చేష్టలతోనే గొప్ప సందేశాన్ని వినిపింప చేశాడు. ఆయన పలికిన ప్రతి పలుకూ కాంతిని ప్రసరించింది, శాంతిని ప్రకటించింది, సత్యాన్ని బోధించింది, జీవ చైతన్యాన్ని కలిగించింది.

Published : 30 Nov 2023 00:35 IST

ప్రభువు కొన్ని సందర్భాల్లో మహా మౌనంగా ఉండేవాడు. మాట్లాడకుండా చేష్టలతోనే గొప్ప సందేశాన్ని వినిపింప చేశాడు. ఆయన పలికిన ప్రతి పలుకూ కాంతిని ప్రసరించింది, శాంతిని ప్రకటించింది, సత్యాన్ని బోధించింది, జీవ చైతన్యాన్ని కలిగించింది. కొత్త మార్గంవైపు పయనింపచేసింది. ఏసు స్వయంగా చెప్పిన మాటలు మాత్రమే అనుసరణీయం అనుకోకూడదు. ఈ భూమి మీద 33 ఏళ్లపాటు సాగిన ఆయన జీవితమంతా పేదరికం, కష్టనష్టాల పట్ల మౌనంగానే అనేక సందేశాలు వినిపించాడాయన. ఏసు చెప్పిన ప్రతి మాటా సాక్షాత్తూ ఆ పరలోకపు దేవుని వాక్కే. ఆ దివ్యత్వమే ఓ మనిషిలా మారి, అపార కృపాప్రవాహమై మన చెంతకు చేరింది. ఒకసారి శతాధిపతి- ‘ప్రభూ! నా సేవకుడు పక్షవాతానికి గురై లేవలేకపోతున్నాడు’ అంటూ (మాథ్యూ 8:5-8) క్రీస్తు ముందు మోకరిల్లాడు. దాంతో ఏసు ‘సరే పద’ అంటూ బయల్దేరాడు. అప్పుడు ‘అయ్యా! నేను పెద్ద ఉద్యోగినే కావచ్చు. కానీ నిన్ను మా ఇంటికి ఆహ్వానించేంతటి అర్హత నాకు లేదు. ఇక్కడి నుంచే నువ్వు ఒక మాట పలికితే చాలు.. నా సేవకుడు లేచి కూర్చుంటాడు’ అంటూ అతడు ఏసు వాక్కుకు ఎంత అద్భుత శక్తి ఉంటుందో నలుగురి ఎదుటా చెప్పాడు. అలా ప్రభువు ఆశీర్వాదంతో సేవకుడు ఆరోగ్యవంతుడయ్యాడు.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని