పరిశుద్ధ హృదయులే పరలోకానికి..

ఈ లోకంలో నీతిమంతులుగా జీవించే వారికి దేవుడిచ్చే భాగ్యం పరలోకం. అది నిరంతరం దేవుడితో కలిసి నివసించే సౌభాగ్యం. అయితే పరలోకం చేరకుండా.. మన శరీర భాగాలే మనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని, అందువల్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఏసు తెలియజేశాడు. ‘ముందుగా మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి.

Updated : 14 Dec 2023 04:08 IST

క్రీస్తు వాణి

ఈ లోకంలో నీతిమంతులుగా జీవించే వారికి దేవుడిచ్చే భాగ్యం పరలోకం. అది నిరంతరం దేవుడితో కలిసి నివసించే సౌభాగ్యం. అయితే పరలోకం చేరకుండా.. మన శరీర భాగాలే మనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని, అందువల్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఏసు తెలియజేశాడు. ‘ముందుగా మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. సంభాషణలు ఉప్పు వేసినట్లు సారం కలిగి ఉండాలి. వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి. మీ మాట అవునంటే అవును.. కాదంటే కాదు- అన్నట్లుగా ఉండాలి’ అంటూ హితవు పలికాడు. ఏసు సిలువపై చిత్రవధ అనుభవిస్తూ కూడా.. అందుకు గురిచేసిన వారిని దూషించక ‘వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు.. కనుక క్షమించు’ అంటూ తండ్రిని కోరాడు. నేత్రాలు మనల్ని ఈ లోకభ్రమలవైపు మరలేలా పురికొల్పుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. స్త్రీలను వక్రంగా చూసినా పాపపు చర్యేనన్నాడు. అన్నిటినీ మించి ‘హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలకు అది కేంద్రమని గ్రహించాలి. శరీరభాగాలు దుర్నీతి సాధనాలు కాకూడదు. పరిశుద్ధ హృదయంతో ఉండేవారే పరలోకంలో ప్రభువును దర్శిస్తారు’ అంటూ చెప్పాడు.                        

స్టెర్జి రాజన్‌ బందెల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని