మనసు కుంగిన భక్తులు

గొప్ప భక్తుడైన ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక పుణ్యస్త్రీ పుత్రుడు చనిపోతే తిరిగి బతికించాడు. ఒక్క పూటకు సరిపోయే పిండి, నూనె మాత్రమే ఉంటే.. అవి ఎన్నటికీ తరగని విధంగా ఆశీర్వదించాడు.

Published : 04 Jan 2024 00:09 IST

గొప్ప భక్తుడైన ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక పుణ్యస్త్రీ పుత్రుడు చనిపోతే తిరిగి బతికించాడు. ఒక్క పూటకు సరిపోయే పిండి, నూనె మాత్రమే ఉంటే.. అవి ఎన్నటికీ తరగని విధంగా ఆశీర్వదించాడు. ఒక సందర్భంలో ఏలియాకు తినడానికేమీ లేకుంటే.. దేవుడే కాకులతో ఆహారం పంపాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్ని చేసినప్పటికీ.. రాణి యెజెబెల్‌ సంహరిస్తుందనే భయంతో ఏలియా కుంగి కృశించాడు. దైవాన్ని ప్రార్థించి, ‘నా ప్రాణాన్ని తీసుకో’ అన్నాడు. అనేక అద్భుతాలు చేసిన ఈ గొప్ప ప్రవక్త కుంగిపోయి ఎందుకు మరణాన్ని కోరుకున్నాడు? అతనికి బతుకుపై ఎందుకు విరక్తి కలిగింది? సామాన్యుల్లా దేవతలు కూడా శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనవుతారా? అందరివీ ఒకేరకమైన శరీరాలా? బైబిల్లో దేవుడెందుకు ఈ విషయాలు రాయించాడు? దాని ద్వారా మనం ఏం గ్రహించాలి? గొప్ప భక్తులకు కూడా చనిపోవాలనే అధమ కోరిక కలుగుతుందా? కారణం ఏమంటే మనకో చిక్కు సమస్య వచ్చినప్పుడు, అది పరిష్కరించుకోలేని శక్తి మనకు లేదనిపిస్తే.. దాన్ని దేవుడికి అప్పగించి, ఇక మర్చిపోవాలి. అంతేగానీ కుంగిపోకూడదు. దైవమే పరిష్కార కర్త. అప్పుడిక కుంగుబాటుకు తావుండదు. ఆత్మన్యూనతాభావం అసలే ఉండదు. బాధల నుంచి గొప్ప విముక్తి లభిస్తుంది.

ఎమ్‌.ఉషారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని