మాయా ప్రపంచం

వర్షం కురిసింది. దాంతో విత్తనాలు మొలకెత్తి వృద్ధి చెందుతాయి. తర్వాత అవి ఫలిస్తాయి. ఆపైన ఆకులు పండిపోయి, ఎండిపోయి మట్టిలో కలిసిపోతాయి. ప్రాపంచిక జీవితం ఒక మాయ అంటూ ఖురాన్‌ చెప్పిన ఉపమానం ఇది. ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స)  మిత్రులతో కలిసి నడుస్తుండగా దారిలో పొట్టి చెవుల మేక మృత దేహాన్ని చూసి ఆగారు.

Updated : 11 Jan 2024 03:46 IST

ఇస్లాం సందేశం

ర్షం కురిసింది. దాంతో విత్తనాలు మొలకెత్తి వృద్ధి చెందుతాయి. తర్వాత అవి ఫలిస్తాయి. ఆపైన ఆకులు పండిపోయి, ఎండిపోయి మట్టిలో కలిసిపోతాయి. ప్రాపంచిక జీవితం ఒక మాయ అంటూ ఖురాన్‌ చెప్పిన ఉపమానం ఇది. ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) మిత్రులతో కలిసి నడుస్తుండగా దారిలో పొట్టి చెవుల మేక మృత దేహాన్ని చూసి ఆగారు. దాని చెవిని పట్టుకుని ‘మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హమ్‌ (రూపాయి)కైనా కొనడానికి ఇష్టపడతారా?’ అనడిగారు. అంతకన్నా తక్కువ విలువకు కూడా కొనమన్నారు. ‘పోనీ ఉచితంగా ఇస్తే తీసుకుంటారా?’ మళ్లీ అడిగారు ప్రవక్త. ‘ఉహూ.. ఈ పొట్టి చెవుల మేక బతికున్నా తీసుకోం. అలాంటిది చనిపోయాక ఎలా తీసుకుంటాం?’ అన్నారు. అప్పుడు ప్రవక్త ‘మీరిలా ఇష్టాలు, అయిష్టాలు పెంచుకుంటున్నారు. కానీ దైవం దృష్టిలో అన్నీ సమానమే. లోకంలో దేని మీదా వ్యామోహం పెంచుకోకుండా, అన్నిటినీ సమదృష్టితో చూస్తూ ఒక బాటసారిలా సాగిపోవాలి- అన్నదే ఖురాన్‌ ఉద్బోధ’ అంటూ హితవు పలికారు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని