వేడినీళ్ల అభిషేకం అక్కడి ఆచారం!

ఆలయాల్లో విగ్రహాలకు పాలు, నెయ్యి, పంచామృతం, నీళ్లతో అభిషేకం చేయడం సాధారణం. కానీ రాయచూరు జిల్లా గబ్బూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడినీళ్లతో అభిషేకం చేయడం ఆచారం.

Published : 01 Feb 2024 00:11 IST

లయాల్లో విగ్రహాలకు పాలు, నెయ్యి, పంచామృతం, నీళ్లతో అభిషేకం చేయడం సాధారణం. కానీ రాయచూరు జిల్లా గబ్బూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడినీళ్లతో అభిషేకం చేయడం ఆచారం. అక్కడ వెంకటేశ్వరునికి అర్చకులు ప్రతి నిత్యం వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. విచిత్రం ఏమిటంటే విగ్రహమూర్తిపై అభిషేకించిన వేడినీళ్లు.. స్వామివారి పాదాలు తాకగానే మంచు అంత చల్లగా మారిపోతాయి. అలాగే ఈ స్వామి నాభి వద్ద చల్లటి నీటితో అభిషేకిస్తే.. అవి పాదాలు తాకగానే సెగలు, పొగలతో వేడినీళ్లుగా మారిపోతాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులెందరో ఆ ఆలయానికి వెళ్తుంటారు.

ఎల్‌.ప్రఫుల్ల చంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని