ధనాశ అనర్థం

డబ్బు మీద దురాశ చాలా చెడు చేస్తుందని బైబిల్‌ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా క్రీస్తును గొప్పగా విశ్వసించిన బ్రదర్‌ భక్త్‌సింగ్‌ ఛాబ్రా జీవితానుభవాలను గుర్తుచేసుకుందాం..

Published : 01 Feb 2024 00:12 IST

బ్బు మీద దురాశ చాలా చెడు చేస్తుందని బైబిల్‌ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా క్రీస్తును గొప్పగా విశ్వసించిన బ్రదర్‌ భక్త్‌సింగ్‌ ఛాబ్రా జీవితానుభవాలను గుర్తుచేసుకుందాం..

ఒకసారి సింగ్‌ 1959లో అమెరికాలో ప్రసంగించేందుకు వెళ్లారు. అక్కడో ధనికుడు ఆయన గురించి విని, కలుసుకోవాలని వచ్చాడు. మాటల్లో ఆ అమెరికన్‌ చెక్‌బుక్‌ తీసి, ‘మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా! దయచేసి దీన్ని నా కానుకగా స్వీకరించండి’ అంటూ పెద్దమొత్తం రాసిన చెక్‌ ఇవ్వబోయాడు. ఆయన దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు అనుకుంటే.. అందుకు భిన్నంగా ‘నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. ఇక దీంతో నాకేం పని?!’ అంటూ సున్నితంగా తిరస్కరించారు బ్రదర్‌ భక్త్‌సింగ్‌.

మరో సందర్భంలో సింగ్‌ ఒక సభలో ప్రసంగించిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అనేకమంది సాగనంపడానికి వచ్చి- నోట్ల కట్టలు, మరెన్నో బహుమతులు ఇవ్వబోయారు. ‘రైలు టికెట్టు కొనివ్వండి చాలు.. ఇవన్నీ నేనేం చేసుకుంటాను?’ అంటూ నచ్చజెప్పి, ఏమీ తీసుకోకుండానే వెళ్లిపోయారు. ధనాశ సమస్త అనర్థాలకూ మూలం అనే సత్యాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా ఆచరణలో చూపి, ఆదర్శమయ్యారాయన.

ఎం.ఉషారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని