అల్లాహ్‌కు సమాధానం చెప్పాలి!

ఆహారం వేడిగా ఉంటే చేతులు, గట్టిగా ఉంటే దంతాలు, చేదుగా ఉంటే నాలుక చెబుతాయి.

Published : 08 Feb 2024 00:05 IST

హారం వేడిగా ఉంటే చేతులు, గట్టిగా ఉంటే దంతాలు, చేదుగా ఉంటే నాలుక చెబుతాయి. ఒకవేళ ఆహారం పాడైపోతే ముక్కు పసిగడుతుంది. ఇవన్నీ దైవం సృజించిన శరీర అవయవాల విధి. అలాగే ఆ ఆహారం ఎలా సంపాదించాం? సక్రమమా, అక్రమమా అనేది అంతరాత్మకు తెలుస్తుంది. ‘అధర్మ సంపాదనతో నిండిన పొట్ట నరకాగ్నికి ఆహుతి అవుతుంది’ అని ముహమ్మద్‌ ప్రవక్త (స) హెచ్చరించారు. ‘డబ్బు ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు?- అనే ప్రశ్నలకు అల్లాహ్‌కు సమాధానం చెప్పాలి. లేదంటే ప్రళయం రోజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’ అని ప్రవక్త తెలియజేశారు. దీన్నిబట్టి అవినీతి, అక్రమ సంపాదన ఎంత పెద్ద పాపమో అర్థమవుతుంది. ఒకరి సొమ్మును కబళించేవారికి ప్రళయం నాడు వినాశనం తప్పదని ఖురాన్‌ చెబుతోంది. అక్రమ సంపాదనతో జీవించేవారి 40 రోజుల నమాజులు స్వీకృతి పొందవు. లంచం ఇచ్చే వారు, తీసుకునేవారు కూడా అల్లాహ్‌ శాపానికి గురవుతారు. భుజించే ముందు- ‘ఇది కష్టార్జితమేనా లేక అక్రమ సొమ్ముతో తెచ్చుకున్నదా?’ అని ఆలోచించాలి. సేద్యం చేసే నేల సారవంతమే అయినా.. నీళ్లు మంచివి కాకుంటే పంట నాశనమవుతుంది. అందువల్ల తినే ఆహారం, తొడిగే దుస్తులు, ఉండే ఇల్లు.. ప్రతిదీ నీతిగానే సంపాదించాలి. లేదంటే ఎన్ని నమాజులు చేసినా వృథాయే.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని