జీవుని దుఃఖం పోవాలంటే..

జీవునికి శరీర ధారణ వల్ల దుఃఖం కలుగుతుంది. పూర్వం చేసిన కర్మల కారణంగా ఈ శరీరం ప్రాప్తిస్తుంది. మనకు ఇతరుల పట్ల ఏర్పడే రాగద్వేషాదుల వల్ల కర్మలు కలుగుతాయి.

Published : 15 Feb 2024 00:12 IST

జీవునికి శరీర ధారణ వల్ల దుఃఖం కలుగుతుంది. పూర్వం చేసిన కర్మల కారణంగా ఈ శరీరం ప్రాప్తిస్తుంది. మనకు ఇతరుల పట్ల ఏర్పడే రాగద్వేషాదుల వల్ల కర్మలు కలుగుతాయి. మన అజ్ఞానం వల్ల రాగాదులు కలుగుతున్నాయి. ఈ అజ్ఞానం పోవాలంటే జ్ఞానాన్ని ఆర్జించాలి. తన నిజమైన స్వరూపాన్ని మరవడం వల్ల దుఃఖం కలుగుతుంది. జ్ఞాన సముపార్జనతో దుఃఖం నుంచి బయటపడొచ్చు అనేది నిశ్చయం. భగవద్గీత జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు- జ్ఞాన తపస్సుతో పవిత్రులు కావాలి, జ్ఞానయజ్ఞంతో ముక్తిని పొందాలి, జ్ఞానాగ్నిని రగిలించి కర్మలు అనే కట్టెలను దగ్ధం చేయాలి, జ్ఞానఖడ్గంతో సంశయాలు అన్నిటినీ ఛేదించాలి, జ్ఞాన దీపాలను వెలిగించి అమృతప్రాయమైన కాంతిని వెదజల్లాలి- అంటూ ఉపదేశించాడు. ఇలా జ్ఞానాన్ని తపస్సు, యజ్ఞం, అగ్ని, ఖడ్గం, దీపం- అంటూ వివిధ రకాలుగా చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే- దుఃఖ నివృత్తికి జ్ఞాన సముపార్జన అత్యంత ఆవశ్యకం.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని