శర్మణే నమః

విష్ణు సహస్రనామావళిలో 87వది. ‘శర్మణే నమః’ పదానికి నిఘంటువుల్లో ఆనందం, సుఖం తదితర అర్థాలున్నాయి. అలాగే ఒక సామాజిక వర్గం వారి పేర్ల చివరన ఈ నామం కనిపిస్తుంది.

Published : 22 Feb 2024 00:05 IST

విష్ణు సహస్రనామావళిలో 87వది. ‘శర్మణే నమః’ పదానికి నిఘంటువుల్లో ఆనందం, సుఖం తదితర అర్థాలున్నాయి. అలాగే ఒక సామాజిక వర్గం వారి పేర్ల చివరన ఈ నామం కనిపిస్తుంది. రామశర్మ, కృష్ణశర్మ మొదలైనవి ఉదాహరణలు. పారమార్థిక పదకోశం మరింత విపులార్థాన్ని తెలియజేస్తూ.. సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల వైకుంఠం అనే అర్థాలను పేర్కొంది. అంటే ఆ స్వామి నిత్య సంతోషుడని భావం. ఉపనయన సమయంలో కృష్ణాజినం ధరించడం ద్వారా వటువు శర్మ అవుతాడు. కృష్ణాజినం పదానికి సామాన్యార్థం జింక చర్మం అయినప్పటికీ అది త్రయీ విద్యాస్వరూపమని విశ్వాసం. ‘త్రయీ’ అంటే వేదం అని అర్థం. అది ధరించినవారు వేదాన్ని అభ్యసించి, చిత్తశుద్ధి కలిగి.. క్రమంగా ‘శర్మ’ అవుతారు. అంటే ఆనందానుభూతికి యోగ్యులవుతారన్నది సారాంశం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని