త్యాగ దాన ప్రస్థానం

ఏసు ప్రభువు యోర్దాను నది నుంచి అరణ్యంలో 40 రోజులు నిద్రాహారాలకు దూరమై ప్రయాణించాడు. ఆయన్ను తప్పు చేయమని, మార్గం మార్చుకోమనీ సాతాను శత విధాల చెప్పినా ప్రభువు మాత్రం నియమం తప్పలేదు.

Published : 22 Feb 2024 00:07 IST

శ్రమ దినాల సందర్భంగా..

సు ప్రభువు యోర్దాను నది నుంచి అరణ్యంలో 40 రోజులు నిద్రాహారాలకు దూరమై ప్రయాణించాడు. ఆయన్ను తప్పు చేయమని, మార్గం మార్చుకోమనీ సాతాను శత విధాల చెప్పినా ప్రభువు మాత్రం నియమం తప్పలేదు. (లూకా4:2) అలాగే ఇజ్రాయెల్‌ దేశస్థులు ఐగుప్తు దేశంలోని చెర నుంచి విమోచనులై తమ ప్రాంతాలకు చేరేందుకు కొండలూ కోనలూ, లోయలూ, వాగులూ వంకలూ దాటుకుంటూ.. 40 ఏళ్లు ప్రయాణించారు. ఈ కాలంలో వాళ్లు ఎదుర్కొన్న కష్టాలు, పరీక్షలూ అన్నీ ఇన్నీ కాదు. క్రీస్తు ప్రయాణం 40 రోజులైతే, ఇజ్రాయెల్‌ వాసుల ప్రయాణం నాలుగు దశాబ్దాలు. ఆ సంఖ్యను అనుసరించి క్రైస్తవ సమాజం క్రీస్తు మరణ పునరుత్థానాలకు ముందు నుంచే ఇలా శ్రమదినాలు పాటించడం ఆనవాయితీ అయ్యింది. ఇందులో- ఉపవాస ప్రార్థనలు, గత దోషాలకు పశ్చాత్తాపం చెంది, వాటిని సరిదిద్దుకోవడం, సమాజానికి హితం చేయడం.. అంటే దాన ధర్మాలు, త్యాగ కృత్యాలు.. అనే ప్రధాన అంశాలుంటాయి. వీటిని ఎంత శ్రద్ధగా పాటిస్తారో అంతగా క్రీస్తు పునరుత్థాన ఫలాలు అందుతాయి. మనసులోని చీకటి తొలగి, కాంతులు ప్రసరిస్తాయి. లేకుంటే, ఈ శ్రమదినాలు గానీ ఈస్టర్‌ పండుగ గానీ దండగే. నామ మాత్రంగా ఉండిపోతుంది.

డా.ఆర్‌.వి.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని