సామాజిక బాధ్యత

ముస్లిం సంప్రదాయంలో రెండు పదాల ఉచ్ఛారణతో పెళ్లి ప్రక్రియ ముగుస్తుంది. దీనినే ఏజాబె ఖుబూల్‌ (అంగీకారం) అని అంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి..

Updated : 16 Jul 2020 15:01 IST

ఇస్లాం సందేశం

ముస్లిం సంప్రదాయంలో రెండు పదాల ఉచ్ఛారణతో పెళ్లి ప్రక్రియ ముగుస్తుంది. దీనినే ఏజాబె ఖుబూల్‌ (అంగీకారం) అని అంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి అంగీకారం లేకపోయినాపెళ్లి జరగదు. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టాఇష్టాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు ప్రవక్త (స). ‘‘స్త్రీల అనుమతితో వారి వివాహం చేయాలి’’ అని ఉద్ఘాటించారు. ఇస్లాం ధర్మంలో పెళ్లి ఒక సామాజిక, ధార్మిక అవసరం. పవిత్రమైన సమాజం నిర్మాణం వైవాహిక వ్యవస్థద్వారానే సాధ్యమవుతుంది.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు