ఆ రాగం జోలికి వెళ్లొద్దు...

ఒకసారి త్యాగరాజస్వామి కూచిపూడి భాగవతులు ప్రదర్శించిన యక్షగానంలో ‘మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణా’ అని గోపికలు బతిమలాడే పాటని, దానికి వారి అభినయాన్ని తెగ మెచ్చుకున్నారు.

Published : 10 Feb 2022 00:38 IST

ఒకసారి త్యాగరాజస్వామి కూచిపూడి భాగవతులు ప్రదర్శించిన యక్షగానంలో ‘మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణా’ అని గోపికలు బతిమలాడే పాటని, దానికి వారి అభినయాన్ని తెగ మెచ్చుకున్నారు.

ప్రదర్శన తర్వాత నాట్యాచార్యులవారు త్యాగరాజు వద్దకు వచ్చి ‘అయ్యా! దీనికి ఆనందభైరవిలో సామాన్య జనులను ఆకర్షించే విధంగా బాణీ కట్టాం. మీకు నచ్చడం మా అదృష్టం. అయితే మీరొక్క వరం ఇవ్వాలి’ అన్నారు. ‘ఏమిటది?’ అనడిగారు త్యాగరాజు. ‘మీరు మహా వాగ్గేయకారులు. రామభక్తి సామ్రాజ్యానికి చక్రవర్తులు. మీరు రాముడి మీద పాటకట్టి ఆనందభైరవి రాగంలో ఆలపిస్తే ఇక మా పాట ఎక్కడ నిలుస్తుంది?! అందుకని ఆ రాగాన్ని మాకు దానం చేయండి! తమరు దాని జోలికి మాత్రం వెళ్లకండి’ అని వేడుకున్నారు.

త్యాగయ్య కాదనలేదు. సంతోషంగా మాట ఇచ్చారు. ఆ సంగీత చక్రవర్తి ఆనందభైరవిలో ఒక్క కృతి కూడా స్వరపరచలేదు.

- మామడూరు శంకర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని