ఆచారాలు ఎందుకట?!

మురుగన్‌ అనే భక్తుడు తన తల్లి తద్దినం రోజు సందర్భంగా ఆశ్రమ వాసులందరికీ పనస తొనలు పంచుతున్నాడు. అది చూసిన రమణులు ‘చనిపోయిన తల్లి మీద మమకారంతో నువ్విలా చేస్తున్నావు!

Published : 03 Mar 2022 01:04 IST

మురుగన్‌ అనే భక్తుడు తన తల్లి తద్దినం రోజు సందర్భంగా ఆశ్రమ వాసులందరికీ పనస తొనలు పంచుతున్నాడు. అది చూసిన రమణులు ‘చనిపోయిన తల్లి మీద మమకారంతో నువ్విలా చేస్తున్నావు! కానీ దీనివల్ల ఇవి తీసుకున్న వారందరితో నీకు తిరిగి కర్మ, రుణబంధం ఏర్పడుతోందని గ్రహించు. ఇది ఆచారమే కావచ్చు. కానీ ఈ ఆచారాలన్నీ కూడా బంధాలను పెంచుతాయి. అప్పుడు ముక్తి దొరకదు. ఇందుకు బదులుగా ఒకచోట నిశ్చలంగా కూర్చుని నీ మాతృమూర్తి గురించి ధ్యానం చేస్తే ఆమె ఆత్మ నీ వద్దకు వచ్చి సేద తీరుతుంది’ అన్నారు. అలాగే చనిపోయిన తండ్రికి తర్పణం వదలడం కోసం అల్పాహారం మానేసిన సుందరేశ్వర్‌ అయ్యర్‌ అనే శిష్యునితో ‘ఆచారాలనేవి దేహానికి మాత్రమే, ఆత్మకి కాదు. నీకు ఆత్మశుద్ధి ఉంది. కనుక ముందు ఫలహారం తిను’ అన్నారు. ఆశ్రమంలో స్త్రీలకు నెలసరి సమయంలో బయట వడ్డించడం చూసి ‘అది దేహ ధర్మం. వారిని లోపలికి పిలిచి భోజనం వడ్డించండి. ఆత్మకు మైల లేదని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా! శరీరమే మనమనే భావన వదిలి, ఆత్మబలాన్ని గ్రహించాలి. అప్పుడిక మడి, మైల, ఆచారాలతో పనేముంది’ అన్నారు రమణ మహర్షి.

- ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని