ప్రదోషకాల పూజకు ఫలితం అధికం

‘ఓం నమః శివాయ’ అని స్మరిస్తే చాలు కరిగి పోతాడు పరమశివుడు. భక్తితో ఓ సుమం సమర్పించినా సంతుష్టుడు ఔతాడా మంజునాథుడు. ఇక స్వామికెంతో ప్రీతి కరమైన ప్రదోష కాలంలో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

Published : 26 May 2022 01:12 IST

‘ఓం నమః శివాయ’ అని స్మరిస్తే చాలు కరిగి పోతాడు పరమశివుడు. భక్తితో ఓ సుమం సమర్పించినా సంతుష్టుడు ఔతాడా మంజునాథుడు. ఇక స్వామికెంతో ప్రీతి కరమైన ప్రదోష కాలంలో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వల్ల ఏర్పడేదే ప్రదోషం. కృష్ణపక్షంలో చతుర్దశి రోజు మాస శివరాత్రి వస్తుంది. దాని ముందురోజు త్రయోదశిని మహా ప్రదోషకాలం అంటారు. శుక్లపక్ష త్రయోదశి నాటి పూజలకు కూడా సత్ఫలితాలుంటాయి. ప్రదోషమంటే పాప నిర్మూలన. తెలిసీ తెలీక చేసే పాపకర్మల వల్ల ప్రతిబంధకాలను కొని తెచ్చుకున్నట్లవుతుంది. దాంతో పురోభివృద్ధికి ఉన్న అవకాశాలు పరిమితమౌతాయి. ఆ పాపకర్మలు నిర్జీవం కావాలంటే, దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. పరమశివుడు ప్రమథగణాలతో కొలువయ్యుండే ప్రదోషకాలంలో శివుని స్మరిస్తే మన పాప కర్మల ఫలాన్ని తాను స్వీకరించి కష్టాలను తొలగిస్తాడనేది భక్తుల నమ్మకం.    

- బి.వెంకటేష్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని