దైవస్మరణ మహిమ

దైౖనందిన కార్యక్రమాల్లో ప్రార్థన ముఖ్యమైంది. స్నానానంతరం శుభ్రమైన దుస్తులు ధరించి దైవారాధన చేయడాన్ని కర్తవ్యంగా భావిస్తాం. నిత్యపూజ సంగతలా ఉంచితే నిరంతరం మదిలో దైవాన్ని స్మరిస్తూనే ఉండాలి.

Published : 23 Mar 2023 00:07 IST

దైౖనందిన కార్యక్రమాల్లో ప్రార్థన ముఖ్యమైంది. స్నానానంతరం శుభ్రమైన దుస్తులు ధరించి దైవారాధన చేయడాన్ని కర్తవ్యంగా భావిస్తాం. నిత్యపూజ సంగతలా ఉంచితే నిరంతరం మదిలో దైవాన్ని స్మరిస్తూనే ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమదేల చందాన.. బాహ్య శుభ్రత ఉన్నంతలో సరిపోదు. మనసు నిర్మలంగా ఉంటేనే ప్రార్థన సఫలమవుతుంది. శారీరక శుభ్రత ప్రధానమే అయినప్పటికీ అతి శీతల ప్రాంతాల్లో ఉదయానే స్నానం చేయడానికి శరీరం సహకరించకపోతే.. నీళ్లు తలపై జల్లుకుని దైవాన్ని స్మరించవచ్చు. కొన్నిసార్లు పుణ్యతీర్థాల్లో స్నానమాచరించే అవకాశం లేనప్పుడు తలపై నీళ్లు చిలకరించుకుని దైవాన్ని ప్రార్థించడమే శరణ్యం.
మనకు తెలిసీతెలియక చేసిన పాపాలు దైవ స్మరణంతో హరిస్తాయి.
దొంగతనం, దోపిడీలు లాంటి పాపకర్మలెన్నో చేసే అజామీళుడు సదా దైవస్మరణ చేసేవాడు. తన పుత్రుడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడం వల్లే నిరంతరం నారాయణ నామాన్ని తలవడం సాధ్యమైంది. అలా చివరి క్షణాల్లోనూ నారాయణ నామస్మరణ చేస్తూ తుదిశ్వాస విడిచాడు. పాపాత్ముడైన అజామీళుణ్ణి నరకానికి తీసుకెళ్లాలని యమకింకరులు వచ్చారు. కానీ దేవదూతలు వారిని అడ్డగించి అజామీళుని స్వర్గానికి తీసుకెళ్లారు. దైవస్మరణకున్న మహిమ అలాంటిది. అందుకే ‘నారాయణ నామ మహాత్మ్యం పొగడ తరమా’- అంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని