Garbha Gudi: గర్భ గుడిలోకి అందరూ ఎందుకు వెళ్లకూడదు?

ఆలయ నిర్మాణ సమయంలో వేద బ్రాహ్మణులు నవధాన్యాలు, నవరత్నాలతో భూమిపూజ చేస్తారు. దైవానికి ప్రతిరూపమైన విగ్రహాన్ని యంత్ర సహితంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు.

Updated : 17 May 2023 07:54 IST

లయ నిర్మాణ సమయంలో వేద బ్రాహ్మణులు నవధాన్యాలు, నవరత్నాలతో భూమిపూజ చేస్తారు. దైవానికి ప్రతిరూపమైన విగ్రహాన్ని యంత్ర సహితంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. యజ్ఞ యాగాది క్రతువులతో, ప్రతి నిత్యం శాస్త్రోక్తమైన మంత్రోచ్చారణతో, వైఖానస, పాంచరాత్ర ఆగమాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విధి విధానాలతో నిర్వహించే ఆ కార్యక్రమాల వల్ల విగ్రహం అనంత దివ్య శక్తిని పొందుతుంది.

నిత్య ధూప దీపాలు, అర్చనలు, నైవేద్యాలతో కళకళ్లాడుతూ సకారాత్మక శక్తితో అలరారుతుంది. అందు వల్లనే ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎంతటి చింతాగ్రస్తులకైనా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. భగవంతుడి ప్రతిష్ఠాపన జరిగిన గర్భగుడిలోకి ఆచార వ్యవహారాలు నిష్ఠగా పాటించే వారికే ప్రవేశం, అన్యులకు నిషిద్ధం. ఎందుకంటే అక్కడి ప్రశాంతతను, పవిత్రతను కాపాడటమే అందులోని ప్రధాన ఉద్దేశం. ఇక్కడ స్నానపానాదులతో కూడిన భౌతిక శుచి మాత్రమే సరిపోదు. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో ఉండాలి. మానసికం గానూ స్ఫటికంలా, స్వచ్ఛంగా ఉండాలి- అన్నారు వేదపండితులు.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు