స్టాటిస్టిక్స్‌తో అవకాశాలేంటి?

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పీజీలో స్టాటిస్టిక్స్‌ చదవాలనుంది. అది చదివినవారికి ఉండే ఉద్యోగ అవకాశాలు, పీజీ అనంతరం ఉన్న ఉన్నత విద్య మార్గాలు తెలపండి.

Published : 18 Jan 2021 00:22 IST

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పీజీలో స్టాటిస్టిక్స్‌ చదవాలనుంది. అది చదివినవారికి ఉండే ఉద్యోగ అవకాశాలు, పీజీ అనంతరం ఉన్న ఉన్నత విద్య మార్గాలు తెలపండి. బి.అనిల్‌
స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టు మీద పట్టున్నవారికి విస్తృతంగా అవకాశాలు ఉంటాయి. పీజీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ లేదా ఎంస్టాట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటాను విశ్లేషించి, వ్యాపార వ్యవహారాల గురించి నిర్ణయాలు తీసుకోవడం స్టాటిస్టిక్స్‌తో సాధ్యం అవుతుంది. డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ లేదా మ్యాథ్స్‌ చదివినవారు ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సులకు దేశంలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)అగ్రగామి సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీ...మొదలైన సంస్థల్లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది. పీజీలో స్టాటిస్టిక్స్‌ చదివినవారికి ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, యాక్చూరియల్‌ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ తర్వాత నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) స్కోర్‌తో పీహెచ్‌డీలో చేరవచ్చు. మరో పీజీ చదవాలనే ఆసక్తి ఉంటే బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో ఎంబీఏ కూడా చేయవచ్చు. యాక్చూరియల్‌ సైన్స్‌లో సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు కూడా చదువుకోవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు