దూరవిద్యలో ఎంటెక్‌..

ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసి ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తున్నాను. దూరవిద్యలో ఎంటెక్‌ చేయొచ్చా? ఉద్యోగానికి సెలవుపెట్టి రెగ్యులర్‌గా ఎంటెక్‌ చేసే    అవకాశం ఉంటుందా?

Published : 03 May 2022 00:58 IST

ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసి ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తున్నాను. దూరవిద్యలో ఎంటెక్‌ చేయొచ్చా? ఉద్యోగానికి సెలవుపెట్టి రెగ్యులర్‌గా ఎంటెక్‌ చేసే    అవకాశం ఉంటుందా?

- రామకృష్ణ


ఎంటెక్‌ కోర్సు దూరవిద్యలో చేయడానికి అవకాశం లేదు. మీరు ఎంటెక్‌ కోర్సుని రెగ్యులర్‌గా చదవాలనుకొంటే రెండు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, మంచి విద్యాసంస్థలో చదివే ప్రయత్నం చేయండి. అతి తక్కువ యూనివర్సిటీల్లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో క్లాసులు సాయంత్రం పూట నిర్వహిస్తారు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎం టెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని