ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఇంటర్‌ ఒకేషనల్‌ మెకానికల్‌ పూర్తి చేశాను. తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను. మళ్లీ డిప్లొమా పూర్తి చేసి బీటెక్‌ చేశాను.

Published : 05 May 2022 05:17 IST

నేను ఇంటర్‌ ఒకేషనల్‌ మెకానికల్‌ పూర్తి చేశాను. తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను. మళ్లీ డిప్లొమా పూర్తి చేసి బీటెక్‌ చేశాను. ఈ విషయాన్ని ఓటీఆర్‌లో ఎలా నింపాలి?

-కాకా

జ: మీరు ఖాళీగా ఉన్న సంవత్సరాన్ని వదిలేసి చదువుకున్న సంవత్సరాలనే ఓటీఆర్‌లో నింపండి. సరిపోతుంది.


ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు నిజామాబాద్‌ జిల్లాలో, అయిదో తరగతి కామారెడ్డిలో, 6 నుంచి10వ తరగతి ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్నాను.నేను ఏ ప్రాంత స్థానికతను పొందుతాను?

- ఇఖిల్‌

జ: కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌ అవుతారు. మీరు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు నిజామాబాద్‌లో చదివారు కాబట్టి ఆ జిల్లా స్థానికతనే పొందుతారు.


నేను 2014లో +2 పూర్తి చేశాను. కొన్ని కారణాల వల్ల డిగ్రీని కొనసాగించలేకపోయాను. మళ్లీ 2021లో ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందా?

- స్వాతి

జ: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత ఉంది.


టీఎస్‌పీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నాను. ప్రిపరేషన్‌లో భాగంగా ఎకనామిక్స్‌కి సంబంధించి తెలుగు అకాడమీతో పాటు ఏ పుస్తకాలను చదివితే బాగుంటుందో తెలియజేయండి.

- శంకర్‌ సుంకమ్‌

జ: ప్రాథమికంగా తెలుగు అకాడమీ పుస్తకాలపై పట్టు సాధించి, ప్రస్తుత ఆర్థిక అంశాలపై అప్‌డేటెడ్‌గా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక సర్వేలను చదవండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని