సాఫ్ట్‌వేర్‌కి మారాలంటే...

బీటెక్‌ సీఎస్‌ఈ పూర్తిచేశాను. మూడేళ్లు స్కూళ్లలో పనిచేశాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ వైపు మారాలంటే ఎలా?

Updated : 18 Jul 2022 02:32 IST

బీటెక్‌ సీఎస్‌ఈ పూర్తిచేశాను. మూడేళ్లు స్కూళ్లలో పనిచేశాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ వైపు మారాలంటే ఎలా?

- ఎం.కీర్తి

* ఇటీవలి కాలంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు అవసరానికి మించిన సంఖ్యలో అందుబాటులో ఉన్నారు. చాలా సంస్థలు వారికి కావలసినవారిని ప్రాంగణ నియామకాల్లోనే తీసుకుంటున్నాయి. ఉద్యోగానుభవం ఉన్నవారిని మాత్రమే నేరుగా నియమించుకొంటున్నారు. మీరు బీటెక్‌ తరువాత స్కూళ్లలో పనిచేశారు కాబట్టి, నేరుగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సాధించడం కొంత కష్టమే. మీ స్కూల్‌ ఉద్యోగానుభవం ఉపయోగపడేలా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీలోకి ప్రవేశించే ప్రయత్నం చేయండి. ఈ రంగంలో టెక్నాలజీ పరిజ్ఞానం, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ టూల్స్‌, డిజిటల్‌ సెక్యూరిటీలపై పట్టు ఉండాలి. వీటితో పాటు యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌, గేమిఫికేషన్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/ ప్రోగ్రామింగ్‌, కాంకరెంట్‌ ప్రోగ్రామింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌, సోషల్‌ మీడియా, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌లపైనా కొంత అవగాహన ఉండాలి. కొంత అనుభవం గడించాక, సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి పూర్తిగా మారే ప్రయత్నం చేయండి.

- ప్రొ. బెల్లకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని