శాట్‌ రాయాలంటే...

స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌)ను కాలేజ్‌ బోర్డ్‌ నిర్వహిస్తుంది. అమెరికా, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి.

Published : 13 Oct 2022 00:24 IST

శాట్‌ ఎగ్జామ్‌ రాయాలంటే ఏ అర్హతలుండాలి? సిలబస్‌ ఏమిటి? ఈ పరీక్ష రాయడానికి జేఈఈ మెయిన్‌ ప్రిపరేషన్‌ సరిపోతుందా?

- జయశ్రీ

స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌)ను కాలేజ్‌ బోర్డ్‌ నిర్వహిస్తుంది. అమెరికా, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. ఇంటర్మీడియట్‌/ 12 క్లాస్‌ పూర్తయినవారు ఈ పరీక్ష రాయవచ్చు.  శాట్‌లో రీడింగ్‌, రైటింగ్‌, మ్యాథ్స్‌ అనే మూడు విభాగాలుంటాయి. రీడింగ్‌లో లిటరేచర్‌, హిస్టారికల్‌ డాక్యుమెంట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, నేచురల్‌ సైన్సెస్‌లో ప్యాసేజ్‌లు ఉంటాయి. రైటింగ్‌లో గ్రామర్‌, ఒకాబ్యులరీ, ఎడిటింగ్‌ మెలకువలు ఉంటాయి. మ్యాథ్స్‌ విషయానికొస్తే దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించి సమాధానాలు కనుగొనడం, మరొకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించకుండా సమాధానాలు కనుగొనడం. మ్యాథ్స్‌ విభాగంలో ప్రశ్నలు ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగొనమెట్రీల నుంచి ఉంటాయి. శాట్‌ని ఒక సంవత్సరంలో ఆరు సార్లు నిర్వహిస్తారు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. జేఈఈ మెయిన్స్‌, శాట్‌ అనేవి రెండు విభిన్నమైన పరీక్షలు. జేఈఈ మెయిన్స్‌లో మ్యాథ్స్‌ కంటే, శాట్‌లో మ్యాథ్స్‌ సులభంగానే ఉంటుంది. శాట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే శాట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు.

-  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని