రక్తదానంతో చర్మ సౌందర్యం!

చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా? త్వరగా ముడతలు పడకుండా చూసుకోవాలని భావిస్తున్నారా? అయితే వీలున్నప్పుడల్లా రక్తదానం చేయండి.

Updated : 03 Jan 2023 00:42 IST

చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా? త్వరగా ముడతలు పడకుండా చూసుకోవాలని భావిస్తున్నారా? అయితే వీలున్నప్పుడల్లా రక్తదానం చేయండి. రక్తాన్ని దానం చేయటం వల్ల చర్మం మందం, చర్మం పైపొర కింద ఉండే కొలాజెన్‌ మోతాదు పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్మం ముడతలు పడటానికి కారణమయ్యే మార్గాలూ గణనీయంగా మారుతున్నట్టూ తేలింది. అంతేకాదు, వాపు ప్రక్రియతో ముడిపడిన జన్యువుల వ్యక్తీకరణ తగ్గుతుండగా.. కొలాజెన్‌తో ముడిపడిన జన్యు వ్యక్తీకరణ ఎక్కువవుతోంది. ఇవన్నీ వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకురాకుండా చూసేవే. రక్తదానంతో ఐరన్‌ నిల్వలు తగ్గుతాయని, ఇది చర్మ సౌందర్యం ఇనుమడించటానికి తోడ్పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరన్‌ నిల్వ మరీ ఎక్కువైతే వృద్ధాప్య ప్రక్రియ పుంజు కుంటుంది. ఇది వయసుతో పాటు ముంచుకొచ్చే సమస్యలకూ దారితీస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని