కొవిడ్‌కు మాంటెలుకాస్ట్‌ కళ్లెం

ఆస్థమా, అలర్జీ చికిత్సలో వాడే మాంటెలుకాస్ట్‌ మందు కొవిడ్‌-19 తగ్గటానికి తోడ్పడుతున్నట్టు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యయనంలో బయటపడింది. ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 ఉత్పత్తి చేసే ప్రొటీన్‌కు అంటుకొని,...

Published : 10 May 2022 01:05 IST

స్థమా, అలర్జీ చికిత్సలో వాడే మాంటెలుకాస్ట్‌ మందు కొవిడ్‌-19 తగ్గటానికి తోడ్పడుతున్నట్టు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యయనంలో బయటపడింది. ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 ఉత్పత్తి చేసే ప్రొటీన్‌కు అంటుకొని, దాన్ని నిలువరిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సార్స్‌-కొవీ-2 విడుదల చేసే ప్రొటీన్లలో ఎన్‌ఎస్‌పీ1 కీలకమైంది. మన రోగనిరోధక కణాల లోపల ఉన్నట్టుండి పెల్లుబుకే తొలి వైరస్‌ ప్రొటీన్లలో ఇదొకటి. ఇది రోగనిరోధక కణాల్లో ప్రొటీన్‌ తయారీ యంత్రాంగమైన రైబోజోమ్‌లకు అంటుకుని, ముఖ్యమైన ప్రొటీన్ల సంశ్లేషణ ప్రక్రియను ఆపేస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మరి ఎన్‌ఎస్‌పీ1 ప్రొటీన్‌ను నిలువరిస్తే వైరస్‌ వృద్ది తగ్గుతుంది కదా. మాంటెలుకాస్ట్‌ మందు సరిగ్గా ఈ పనే చేస్తుంది. ఇది ఎన్‌ఎస్‌పీ1 ప్రొటీన్‌కు ఒక చివర బలంగా అంటుకొని, వైరస్‌ వృద్ధి చెందకుండా చేస్తుంది. ఈ మందును ఆస్థమా, అలర్జీల వంటి జబ్బుల్లో వాపు ప్రక్రియను తగ్గించటానికి చాలాకాలంగా వాడుతూనే ఉన్నారు. తాజా అధ్యయన ఫలితాల నేపథ్యంలో దీన్ని మరింత పరిపుష్టం చేయటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు. అలాగే వైరస్‌ను నిలువరించే సామర్థ్యం ఎక్కువగా గల ఇతర మందులను గుర్తించటానికీ ప్రయత్నిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని