తల పట్టీతోనే అల్జీమర్స్ గుర్తింపు
జ్ఞాపకశక్తిని క్షీణింపజేసి, ఆలోచనా తీరును దెబ్బతీసి, మొత్తంగా జీవితాన్నే అతలాకుతలం చేసే అల్జీమర్స్‌ను తొలిదశలోనే గుర్తిస్తే? లక్షణాలు ఆరంభం కావటానికి చాలా ఏళ్ల ముందుగానే పసిగడితే? అదీ తలకు ధరించే బ్యాండుతోనే కనుగొంటే?
జ్ఞాపకశక్తిని క్షీణింపజేసి, ఆలోచనా తీరును దెబ్బతీసి, మొత్తంగా జీవితాన్నే అతలాకుతలం చేసే అల్జీమర్స్‌ను తొలిదశలోనే గుర్తిస్తే? లక్షణాలు ఆరంభం కావటానికి చాలా ఏళ్ల ముందుగానే పసిగడితే? అదీ తలకు ధరించే బ్యాండుతోనే కనుగొంటే? అలాంటి విధానాన్నే రూపొందించారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఇది ఎలక్ట్రో ఎన్‌కెఫలోగ్రఫీ (ఈఈజీ) సాయంతో నిద్ర తీరుతెన్నులను పసిగట్టటం ద్వారా పనిచేస్తుంది. ఇలా నిద్రలో జ్ఞాపకశక్తి పునరుత్తేజితం కావటంతో ముడిపడిన మెదడు తరంగాలను గుర్తిస్తుంది. ఈ తరంగాలకూ గాఢ నిద్రలో జ్ఞాపకాలు కుదురుకునే సమయంలో మెదడులో ప్రొటీన్ల అసాధారణ మోతాదులకూ సంబంధం ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ఆధారంగా లక్షణాలు ఆరంభం కావటానికి చాలా ముందుగానే అల్జీమర్స్‌ను గుర్తించొచ్చని నిరూపించారు. అల్జీమర్స్‌తో వచ్చే స్వల్ప విషయగ్రహణ లోపం తొలి దశలనూ ఈఈజీ సంకేతాలు పసిగట్టగలవనీ తేలింది. అల్జీమర్స్‌ను తొలిదశల్లోనే గుర్తించి, దాన్ని తగ్గించుకోవటంలో ఎవరికివారు, తేలికగా వాడుకోగల తల పట్టీ పరికరాలు గొప్ప ముందడుగు కాగలవని పరిశోధకులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు.. స్వచ్ఛసేవలో అధికారుల ‘చెత్త పని’
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు