మధుమేహానికి మతిమరుపు తోడైతే..

మధుమేహంతో బాధపడుతున్నారా? పైగా విషయ గ్రహణ సామర్థ్యమూ తగ్గిన లక్షణాలు.. అంటే మతిమరుపు, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటివీ కనిపిస్తున్నాయా?

Updated : 03 May 2022 06:33 IST

ధుమేహంతో బాధపడుతున్నారా? పైగా విషయ గ్రహణ సామర్థ్యమూ తగ్గిన లక్షణాలు.. అంటే మతిమరుపు, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటివీ కనిపిస్తున్నాయా? అయితే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మధుమేహానికి విషయగ్రహణ క్షీణత కూడా తోడైతే పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు మరింత పెరుగుతున్నట్టు కెనడాలోని మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. విషయగ్రహణ సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన మధుమేహులకు గుండెపోటు వచ్చే అవకాశం 1.6 రెట్లు ఎక్కువగా ఉంటుండగా.. పక్షవాతం ముప్పు 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలింది. వీరికి మరణం ముప్పూ ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. మధుమేహుల్లో విషయగ్రహణ సామర్థ్యం క్షీణించటాన్ని బట్టి గుండెపోటు, పక్షవాతం ముప్పులను అంచనా వేసే అవకాశముందని ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. వీటి మధ్య సంబంధానికి కారణమేంటో స్పష్టంగా బయటపడలేదు గానీ మతిమరుపు, ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు కనిపించిన మధుమేహులకు పక్షవాతం, గుండెపోటు రాకుండా ముందు నుంచే మందులు ఆరంభించటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని