దీర్ఘకాల మూర్ఛతో మతిమరుపు!

ఎప్పుడో పదేళ్ల క్రితం స్నేహితుడి ఇంటిని చూశారు. మళ్లీ ఇప్పుడే అక్కడికి వెళ్లటం. అయినా సరిగ్గా ఆ ఇంటికే వెళ్తాం

Updated : 27 Dec 2022 05:05 IST

ఎప్పుడో పదేళ్ల క్రితం స్నేహితుడి ఇంటిని చూశారు. మళ్లీ ఇప్పుడే అక్కడికి వెళ్లటం. అయినా సరిగ్గా ఆ ఇంటికే వెళ్తాం. చుట్టుపక్కల చెట్లు, కట్టడాలు, దారుల సాయంతో దాన్ని పోల్చుకుంటాం. ఆయా స్థలాల పరిసరాల సమాచారం మెదడులో నిక్షిప్తం కావటం వల్లనే వాటిని గుర్తుపెట్టుకోవటం సాధ్యమవుతుంది. దీర్ఘకాలిక మూర్ఛతో బాధపడేవారిలో ఇలాంటి జ్ఞాపకశక్తి కొరవడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ బాన్‌ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. ఎలుకలపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించారు. జ్ఞాపకాలను.. ముఖ్యంగా స్థలాలకు సంబంధించిన సమాచారాన్ని విడమరచుకోవటంలో  మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ‘స్థల కణాల’ వంటివి ఉంటాయి. ఇవి మనం చూసిన ప్రాంతాలను గుర్తు తెచ్చుకోవటానికి తోడ్పడతాయి. ఎలుకల హిప్పోక్యాంపస్‌లో సుమారు 10 లక్షలకు పైగా ఇలాంటి కణాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిల్లో ప్రతి ఒక్కటీ ఆయా పర్యావరణ స్వభావాల సమ్మేళనాన్ని గుర్తిస్తాయని, దీర్ఘకాల మూర్ఛతో ఈ కణాల మధ్య అను సంధానాలు దెబ్బతింటున్నాయని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని