మూత్ర సమస్యలా?

ఎండాకాలంలో మూత్రకోశ సమస్యలు ఎక్కువ. మహిళల్లో మరింత అధికం. తొలిదశలో వీటిని చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

Updated : 04 Apr 2023 04:37 IST

ఎండాకాలంలో మూత్రకోశ సమస్యలు ఎక్కువ. మహిళల్లో మరింత అధికం. తొలిదశలో వీటిని చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. నీళ్లు, పండ్ల రకాల వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకుంటే మూత్రం బాగా వస్తుంది. దీంతో బ్యాక్టీరియా తేలికగా బయటకు వెళ్లిపోతుంది. విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి బత్తాయి, నారింజ రసం తాగటం.. విటమిన్‌ సి మాత్రలు వేసుకోవటం ద్వారా మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలను తగ్గించు కోవచ్చు. వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఫంగల్‌, యాంటీబ్యాక్టీరియా గుణాలున్నాయి. దీనిలోని అలిసిన్‌ రసాయనం ఇ.కొలితో తలెత్తే మూత్రకోశ ఇన్‌ ఫెక్షన్‌ తగ్గ టానికి తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని