అంతకు మందు... ఆ తర్వాత!

రంగురంగుల సీతాకోకచిలుకలంటే మనకు భలే ఇష్టం... అవన్నీ గొంగళి పురుగుల నుంచి వస్తాయనే అనుకుంటాం... మనం చూసే ముళ్లతో ఉండే  గొంగళి పురుగులే కాదు... వాటిలోనూ చాలా రకాలుంటాయి... కొన్ని అందంగా, కొన్ని చిత్రంగా ఉంటాయి... అవి గూడు కట్టుకుంటే కొన్ని  సీతాకోకచిలుకలవుతాయి...

Published : 13 Jun 2019 00:30 IST

రంగురంగుల సీతాకోకచిలుకలంటే మనకు భలే ఇష్టం... అవన్నీ గొంగళి పురుగుల నుంచి వస్తాయనే అనుకుంటాం... మనం చూసే ముళ్లతో ఉండే  గొంగళి పురుగులే కాదు... వాటిలోనూ చాలా రకాలుంటాయి... కొన్ని అందంగా, కొన్ని చిత్రంగా ఉంటాయి... అవి గూడు కట్టుకుంటే కొన్ని  సీతాకోకచిలుకలవుతాయి... కొన్ని మాత్‌లుగా మారుతుంటాయి... రకాల్లో తేడాల్ని బట్టి వచ్చే చిలుకల్లోనూ  తేడాలుంటాయన్నమాట. వాటిలో తమాషాగా ఉన్న చిత్రాలే ఇవన్నీ!

బ్రహ్మిన్‌ మాత్‌ 


అతి పెద్ద మాత్‌ రకాల్లో ఇవీ ఒకటి. మన దేశంతోపాటు మయన్మార్‌, భూటాన్‌, చైనా, తైవాన్‌, జపాన్‌ల్లో కనిపిస్తుంటాయివి. ఔల్‌ మాత్‌ అనే పేరూ ఉంది.

చెరురా వినులా 


చిత్రమైన ముఖంతో ఉండే ఈ పురుగు నుంచే పెద్దగా రంగుల్లేని ఈ మాత్‌ వస్తుంది. ఈ పురుగు మీదికి ఏదన్నా దాడి చేస్తుందనుకున్నప్పుడు తోకల్ని పైకి పెట్టి భయపెట్టేస్తుంది.

అక్రగా కోవా మాత్‌ 


గాజులా మెరిసి పోతున్న పురుగు నుంచి వచ్చిన మాత్‌ సైతం అంతే చిత్రంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా మెక్సికో, బెలీజ్‌, హోండూరస్‌, గూటమలా, కోస్టారికా, పనామా దేశాల్లో కనిపిస్తుంటాయి.

అటకస్‌ అట్లాస్‌ మాత్‌


మన అరచేతికంటే పెద్దగా ఉంటుందీ మాత్‌. రెక్కలు చాచితే 12 అంగుళాల పొడవుంటుంది. ఆసియాలోనే కనిపిస్తాయివి.

ఐవో మాత్‌ 


అమెరికా, కెనడాల్లో ఎక్కువగా కనిపించే పురుగులివి. ఒంటిని ఆకులతో కప్పుకొన్నట్టు కనిపిస్తాయి. వీటి నుంచి వచ్చే మాత్‌లు పెద్ద నల్ల మచ్చలతో ఉంటాయి.

గ్లాస్‌ వింగ్డ్‌ బటర్‌ఫ్లై 


పారదర్శకమైన రెక్కలతో ఉండే ఈ సీతాకోకచిలుకలు వాటి బరువుకు 40 రెట్లు బరువును మోయగలవు. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తుంటాయి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని